ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఖుషి ఆనందంగా యష్, వేదాలతో పాటు ఇంటికి వస్తుంది.వచ్చి, నానమ్మ నేను అన్నయ్యకి రాఖీ కట్టాను అని అంటుంది. అవునా అమ్మ అని అనగా ముందు అన్నయ్య ఇంట్లో లేరని చెప్పారు నానమ్మ, తర్వాత నేను ఒక ట్యూన్ పాడాను. అప్పుడు అన్నయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని అంటుంది.ఖుషి లోపలికి వెళ్లిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది అని మాలిని అడుగుతుంది. అప్పుడు యష్,జరిగిన విషయం అంతా చెప్తాడు.