Writer Padmabhushan Review: `రైటర్‌ పద్మభూషణ్‌` మూవీ రివ్యూ , రేటింగ్‌

First Published | Feb 3, 2023, 1:58 AM IST

తెరపై ఒక్క సీన్‌లో కనిపిస్తే చాలు అనే ఆలోచన నుంచి హీరోగా, బిగ్గెస్ట్ స్టార్లతో పోటీగా తన సినిమా రిలీజ్‌ స్థాయికి చేరుకోవడం నిజంగా సుహాన్‌ సక్సెస్‌కి, టాలెంట్‌కి నిదర్శనం. ఆయన నటించిన `రైటర్‌ పద్మభూషణ్‌` చిత్రం నేడు శుక్రవారం (ఫిబ్రవరి 3)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

క్యారెక్టర్‌ ఆర్టిస్టు నుంచి హీరోగా మారి ఆకట్టుకుంటున్నారు హీరో సుహాస్‌. తెరపై ఒక్క సీన్‌లో కనిపిస్తే చాలు అనే ఆలోచన నుంచి హీరోగా, బిగ్గెస్ట్ స్టార్లతో పోటీగా తన సినిమా రిలీజ్‌ స్థాయికి చేరుకోవడం నిజంగా సుహాన్‌ సక్సెస్‌కి, టాలెంట్‌కి నిదర్శనం. ఇప్పటికే `కలర్‌ ఫోటో`తో హీరోగా ఆకట్టుకున్నాడు. జాతీయ అవార్డు చిత్రంలో భాగమయ్యాయి. ఇప్పుడు హీరోగా రెండో ప్రయత్నం చేశాడు. అయితే మొదటిసారి ఆయన థియేటర్లలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు వచ్చారు. ఆయన నటించిన `రైటర్‌ పద్మభూషణ్‌` చిత్రం నేడు శుక్రవారం (ఫిబ్రవరి 3)న విడుదలైంది. ఇప్పటికే ప్రత్యేకంగా వేసిన ప్రీమియర్స్ కి విశేష ఆదరణ లభిస్తుంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
 

కథ:
గొప్ప రైటర్‌గా పేరుతెచ్చుకోవాలనుకుంటాడు లైబ్రేరియన్‌ గా పనిచేసే రైటర్‌ పద్మభూషణ్‌(సుహాస్‌). అతనిది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. తండ్రి(ఆశిష్‌ విద్యార్థి), తల్లి సరస్వతి(రోహిణి) తనని బాగా ఎంకరేజ్‌ చేస్తుంటాడు. రైటర్‌గా పద్మభూషణ్‌ ఓపుస్తకం కూడా రాస్తాడు. కానీ దాన్ని ఎవరూ కొనరు, చదవరు. చదివిన ఒక్కరిద్దరు అసలు పుస్తకంలా లేదని, ఇలా ఎవరైనా రాస్తారా అంటూ తిట్టిపోస్తుంటాడు. బలవంతంగా తన పుస్తక కాపీలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండాడు పద్మభూషణ్‌. రైటర్‌గా తాను పనికి రాను అనే స్థితిలో బాగా కుంగిపోతుంటాడు. ఇంతలో తన పేరుతో ప్రచురితమైన ఒక బుక్‌ బాగా పాపులర్‌ అవుతుంది. దీంతో అది తనే రాశానని ప్రచారం చేసుకుంటూ చెలామణి అవుతుంటాడు. ఇతను గొప్ప రైటర్ అని చెప్పి తన మామయ్య కూడా తన కూతురు సారిక(టీనా శిల్పరాజ్‌)తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. ఇద్దరు కలిసి తిరుగుతూ ప్రేమించుకుంటారు. కానీ సడెన్‌గా ఓ రోజు ఆ రైటర్‌ బ్లాగ్‌లో స్టోరీస్‌ రాయడం మానేస్తాడు. దీంతో పద్మ భూషణ్‌లో టెన్షన్‌ స్టార్ట్ అవుతుంది. తన ఎంగేజ్‌మెంట్‌ రోజు కొత్త పుస్తకం లాంచ్‌ చేస్తానని మామయ్యకి మాట కూడా ఇస్తాడు. కానీ తనకు రాయడం రాదు, రాసే ఘోస్ట్ రైటర్‌ ఎవరనేది అర్థం కాదు, మరి ఆ రైటర్‌ ని ఎలా కనిపెట్టాడు? ఆ రైటర్ ఎవరు? రైటర్‌ అవ్వాలనే కోరిక నెరవేరిందా? పద్మభూషణ్‌ కథలో తల్లి పాత్రేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 

కథ పరంగా ఇదొక సింపుల్‌ స్టోరీ. రైటర్‌ అవ్వాలనుకునే పద్మభూషణ్‌ అనే మామూలు వ్యక్తి కథ. ఆయన రైటర్‌ అవ్వాలనుకునేందుకు సాగే జర్నీని ఈ చిత్రం తెలియజేస్తుంది.  అంతేకాదు మహిళల్లో దాగున్న ప్రతిభని, అమ్మ కోరికలను ఆవిష్కరించే చిత్రమిది. మధ్యతరగతి జీవితాలను ఆవిష్కరించింది. సినిమా ఆద్యంతం ఫన్‌ రోలర్‌ కోస్టర్‌ లా సాగుతుంది. ఇన్నోసెన్సీతో కూడిన ఫన్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. మొదటి భాగం మొత్తం రైటర్‌గా పద్మభూషణ్‌ బుక్‌ పబ్లిష్‌ చేయడం, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. తన పుస్తకాన్ని ఇతరుల చేత చదివించే ప్రయత్నం, వాళ్లకి బుక్‌ గురించి తెలియజేసే ప్రయత్నం ఫన్నీగా సాగుతూ కామెడీని పంచుతుంది. దీనికితోడు లవ్‌ ట్రాక్‌లోనూ పుట్టే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇది హైలైట్గా నిలుస్తుంది.  

అయితే తాను రైటర్‌ కాదు, మరో రైటర్‌ తన పేరుతో బుక్‌ పబ్లిష్‌ చేస్తున్నారని, అది ఎవరనేదికనిపెట్టే క్రమంలో ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. వాహ్‌ ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. సెకండాఫ్‌లోనూ ఫన్‌ కంటిన్యూ అవుతూనే, ఎమోషనల్‌గా సాగుతుంది. రైటర్ గా ప్రయత్నాలు, తాను ఆ రైటర్‌ కాదని నిజం తెలియడంతో పడే బాధ, కొత్త రైటర్‌నివెతికే ప్రయత్నాలు, జీవితం తలకిందులుగా మారుతున్న సమయంలో వచ్చే సీన్లు, సుహాస్‌ నటన ఎమోషనల్‌ గా సాగుతుంది. చివర్లో ట్విస్ట్, ఆ ట్విస్ట్ తో కూడిన ఫినిషింగ్‌ టచ్‌ గుండెల్ని బరువెక్కిస్తుంది. పిండేస్తుంది. సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు కామెడీగా సాగుతుందని, ఆ తర్వాత ఎమోషనల్‌ ట్రాక్‌ తీసుకుంటుంది. క్లైమాక్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. సన్నివేశాలు తగ్గట్టు పాత్రల నటన, బ్యాక్‌ గ్రౌండ్‌ ఫన్నీ మ్యూజిక్‌ సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచాయి. అంతేకాదు ట్విస్ట్ రివీల్‌ తర్వాత కథ మొత్తం టర్న్ తీసుకుంటుంది. అప్పటి వరకు హీరో సుహాస్‌ అనిపిస్తుంది, ఆ తర్వాత హీరో అమ్మ(రోహిణి) అవుతుంది. పెళ్లైన తర్వాత కూడా మహిళల కోరికలను తెలుసుకుని, గౌరవించి ప్రోత్సాహించాలనే సందేశం బాగుతుంది. మహిళలకు బాగా కనెక్ట్ అవుతుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రధానంగా బలమైన కథ లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. కథని ఇంకా బలంగా రాసుకుని చేస్తే బాగుండేది. ఎమోషన్స్ కూడా అన్ని సీన్లలో క్యారీ కాలేదు. దీంతో తేలిపోయాయి. మధ్య మధ్యలో కథ గాడి తప్పుతుందా అనిపిస్తుంది. చాలా చోట్ల లాజిక్కులు లేవు.  కానీ క్లైమాక్స్ సినిమాని కాపాడుతుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా మహిళలకు సంబంధించి మంచి సందేశం అందించే ఓ డీసెంట్‌ ప్రయత్నంగా చెప్పొచ్చు. 
 

నటీనటులుః
పద్మభూషణ్‌గా సుహాస్‌ సినిమాని తన భుజాలపై మోశాడు. ఇన్నోసెంట్‌గా, ఎమోషన్స్ సీన్లలోనూ అద్భుతంగా నటించాడు. చాలా చోట్ల గుండెల్ని పిండేశాడు. రోహిణి పాత్ర బాగుంది. చివర్లో ఆమె పాత్రకి ఎలివేషన్‌ దక్కుతుంది. నటన పరంగా వంక పెట్టేది లేదు. ఆశిష్‌ విద్యార్థి మరోసారి చించేశాడు. హీరోయిన్‌ టీనా శిల్పారాజ్‌ ఆకట్టుకుంది. మరో అమ్మాయి గౌరీ ప్రియారెడ్డి ఫర్వాలేదనిపించింది. సుహాస్‌ ఫ్రెండ్ పాత్ర, గోపరాజు రమణ పాత్రలు ఆకట్టుకుంటాయి. 

టెక్నీషియన్లుః
దర్శకుడు షణ్ముఖ్‌ ప్రశాంత్‌కిది తొలి చిత్రమైనా బాగా డీల్‌ చేశాడు. బలమైన కథతో తీస్తే సినిమా నెక్ట్స్ లెవల్‌ ఉండేది. కానీ తనలో విషయం ఉందని మాత్రం చెప్పొచ్చు. చాలా సీన్లు పరిణతితో డీల్‌ చేశాడు. వెంకట్‌ ఆర్‌ శాఖమూరి కెమెరా వర్క్ బాగుంది. కలర్‌ఫుల్‌గా, డీసెంట్‌గా ఉన్నాయి. శేఖర్‌ చంద్ర సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి పెద్ద అసెట్‌. పాటలు బాగున్నాయి. ఫన్నీ బీజీఎం ఎంగేజ్‌ చేస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి సినిమాకి ఎంత పెట్టాలో అంత పెట్టారు. 

ఓవరాల్‌గాః `రైటర్‌ పద్మభూషణ్‌` నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నం. ఫన్‌, ఎమోషన్స్ తో సాగే రోలర్‌ కోస్టర్‌. 

రేటింగ్‌ః 2.75

Latest Videos

click me!