కమల్ హాసన్ లో చెడు లక్షణాలు చెప్పిన కె. విశ్వనాథ్.. కళాతపస్విని బలవంతంగా ఒప్పించాడట

Published : Feb 03, 2023, 12:50 AM IST

లెజెండ్రీ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ మరణించారనే వార్త టాలీవుడ్ ని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. గత కొంతకాలంగా కె విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

PREV
16
కమల్ హాసన్ లో చెడు లక్షణాలు చెప్పిన కె. విశ్వనాథ్.. కళాతపస్విని బలవంతంగా ఒప్పించాడట

లెజెండ్రీ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ మరణించారనే వార్త టాలీవుడ్ ని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. గత కొంతకాలంగా కె విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటికే పరిమితం అయ్యారు. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన తుదిశ్వాస విడిచి తిరిగిరానిలోకాలకు వెళ్లారు. 

26

శంకరాభరణం, స్వయం కృషి, స్వాతిముత్యం, ఓ సీత కథ, సాగర సంగమం, స్వర్ణకమలం, ఆపద్భాందవుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన కళాఖండాలని తీర్చిదిద్దారు. ఆయన చిత్రాలలో భారతీయత, తెలుగుదనం ఉట్టిపడుతుంది. సాంప్రదాయాలు కళలకు పెద్దపీఠ వేస్తారు. అందుకే ఆయన కళాతపస్వి అయ్యారు. 

36

కె విశ్వనాథ్ గారికి లెజెండ్రీ నటులు కమల్ హాసన్ , చిరంజీవి లాంటి స్టార్స్ తో విడదీయరాని అనుబంధం ఉంది. ఓ సందర్భంలో విశ్వనాథ్ గారు కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ గురించి నవ్వించేలా మాట్లాడుతూ.. కమల్ విశ్వరూపం మీకు ఎవరికీ తెలియదు. అతనిలో చాలా చెడు లక్షణాలు ఉన్నాయి. 

46

మొదటి చెడు లక్షణం ఆయనకి సినిమా గురించి అపారమైన నాలెడ్జ్ ఉంది. నటనలో, దర్శకత్వంలో అతనికి తెలియనిది అంటూ లేదు. అంత నాలెజ్డ్ ఉండడం తప్పు సినిమా రంగంలో  అంటూ విశ్వనాథ్ నవ్వించారు. 

56

కమల్ హాసన్ దశావతారం సినిమా చేశారు. నేను దర్శకుడిగా ఒక అవతారం మాత్రమే చేశాను. నటుడిగా మీరు రెండవ అవతారం ఎత్తాలి అని నన్ను బలవంతం చేసింది కమల్ హాసనే అని విశ్వనాథ్ గతంలో గుర్తు చేసుకున్నారు. కమల్ హాసన్, చిరంజీవి మధ్య తేడా ఏంటి అని అడిగితే ఆయన ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. నేను ఇద్దరి నటుల మధ్య వ్యత్యాసాలు గమనించను. కమల్ తో సినిమా చేస్తుంటే.. ఎలాంటి నటన రాబట్టాలి.. చిరంజీవితో చేస్తుంటే ఆ కథకి తగ్గట్లుగా ఎలా నటింపజేయాలి అని మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. 

66

విశ్వనాథ్ గారు 2000 నుంచి నటుడిగా ఫుల్ లెన్త్ రోల్స్ చేయడం ప్రారంభించారు. నరసింహ నాయుడు, సంతోషం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, లక్ష్మి నరసింహా , ఠాగూర్, అతడు లాంటి చిత్రాల్లో కీలక పాత్రలో నటించారు. 

click me!

Recommended Stories