అయితే ఈ క్రేజీ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని వాడుకుంటూ కొందరు సైబర్ నేరగాళ్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగుళూరులో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ చిత్రంలో ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని చాలా మంది వర్తమాన నటీనటులు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.