ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్ ( Madhavan) ప్రస్తుతం విలక్షణమైన పాత్రల్లో నటిస్తున్నారు. అప్పట్లో మాధవన్ చిత్రాల్లో ప్రేమ పాటలు యువతని పిచ్చెక్కించేవి. సఖి, చెలి లాంటి చిత్రాల్లో సాంగ్స్ ఇప్పటికీ యువతని ఆకట్టుకుంటూ ఉంటాయి. వయసు పెరగడంతో మాధవన్ వైవిధ్యమైన పాత్రలు ప్రయత్నిస్తున్నాడు.