రష్మికను ఆనంద్ దేవరకొండ అలా పిలుస్తాడా..? అసలు నిజం బయటపడిందిగా..?

Published : Mar 17, 2024, 11:07 AM IST

విజయ్ దేవరకొండ రష్మిక మదన్న మధ్య ప్రేమ కథలు, కహానీలు..సోషల్ మీడియాలో కోకొల్లలుగా చూస్తుంటాం... ఇప్పటికే వీరి పెళ్ళి  కూడా చేసేశారు సోషల్ మీడియా జనాలు.. అయితే తాజాగా విజయ్ తమ్ముడు.. టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ.. రష్మిక మధ్య జరిగిన చాట్ బయటకు వచ్చింది. అందులో ఏముందంటే..?   

PREV
16
రష్మికను ఆనంద్ దేవరకొండ అలా పిలుస్తాడా..? అసలు  నిజం బయటపడిందిగా..?

విజయ్ దేవకొండ- రష్మిక మందన్నా ప్రేమించుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. దానికి ఎన్నో సాక్ష్యాలు చూపిస్తుంటారు సోషల్ మీడియా జనాలు. కాని అందులో నిజం ఎంత ఉంది అనేది వారి నోటి నుంచి మాత్రం ఇంత వరకూ రాలేదు. కాని అప్పుడప్పుడు డిన్నర్ డేట్ లకు వెళ్ళడం.. ఫారెన్ ట్రిప్పుల ద్వారా వీరి బంధం బయటపడుతూ వచ్చింది. కాని అది ప్రేమ అని చెప్పడానికి లేదు. 
 

26

ఇలా ఆడియన్స్ ను.. ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తూ వస్తున్నారు. వస్తున్నారు ఈ కపుల్.. ఇద్దరు ఈ రూమర్స్ పై ఎప్పుడూ మాట్లాడలేదు. గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేదు. దాంతో వీరి మధ్య ఏదో ఉంది అని ఫిక్స్ అవుతున్నారు. అంతే కాదు ఫారెన్ ట్పిప్పుకు ఇద్దరూ కలిసి వెళ్లకపోయినా.. ఒకే లొకేషన్ కు వెళ్ళడం.. డ్రస్ కోడ్ మెయింటేన్ చేయడం.. ఇవన్నీ ఫ్యాన్స్ కు అనుమానం తెప్పిస్తూనే ఉన్నాయి. 
 

36

అంతే కాదు.. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా రష్మికతో క్లోజ్ గా ఉంటుంటాడు. ఆమెతో ఎన్నోసార్లు స్టేజ్ న్ షేర్ చేసుకున్న ఆయన.. రష్మికను క్లోజ్ గా పిలవడం..ఫ్యాన్స్ వదినా వదినా అని పిలవాలంటూ.. కామెంట్లు చేయడం లాంటివి బాగా వైరల్ అయ్యాయి అప్పట్లో.. ఈ క్రమంలో.. తాజాగా ఆనంద్ దేవరకొండ.. రష్మిక మధ్య జరిగిన ఓ కాన్వర్జేషన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 

46

రష్మిక – విజయ్ మధ్య ఏదో ఉందని మరోసారి వీరి చాట్ వల్ల  వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే.. ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు అతనికి విషెష్ చెప్తున్నారు. ఈ క్రమంలో రష్మిక మనదన్న కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే ఆనందా.. అని పోస్ట్ చేసింది.
 

56

దీంతో ఈ పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీ  పోస్ట్ చేస్తూ థ్యాంక్యూ రషీ.. కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు. దీనికి రష్మిక మళ్ళీ తన స్టోరీలో రిప్లై ఇస్తూ అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇమ్మనేది అని సరదాగా మరో సమాధానం చెప్పింది. 
 

66

దాంతో ఈ కాన్వర్జేషన్ అంతా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ రష్మిక మందన్నని అంత స్వతంత్రంగా..  క్యూట్ గా రషీ అని పిలుస్తాడని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.. దాంతో విజయ్ తో రష్మిక బంధం మరోసారి బయటపడింది అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. 
 

click me!

Recommended Stories