పర్లేదు తమ్ముడు నీకు నిజంగా ఇష్టమైతే నేనే దగ్గర ఉండి పెళ్లి చేస్తాను అని అంటాడు. దానికి సామ్రాట్ అలాగైతే నేను నీకు నిజం చెప్తాను నాకు తులసి అంటే చాలా ఇష్టం అని అంటాడు. నందు, కొన్ని కొన్ని సార్లు తులసి అంటే నేను విడాకులు ఇచ్చేసిన భార్యల కనిపిస్తూ ఉంటుంది అని అంటాడు. ఎందుకు విడాకులు ఇచ్చేసావు అని సామ్రాట్ అడగగా మాకు పెళ్లయిన తర్వాత అభి పుట్టాడు, ప్రేమ్ పుట్టాడు, దివ్య పుట్టింది, కానీ నాకు తులిసి మీద ప్రేమ మాత్రం పుట్టలేదు అని అన్నాడు.