Trisha: డిప్యూటీ సీఎంగా త్రిష ? రూట్ క్లియర్ చేసిన రాఘవ లారెన్స్, అసలేం జరుగుతోంది?

Published : Jul 02, 2026, 04:49 PM IST

త్రిష రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయ్యిందా..? సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగానే ఆమె డిప్యూటీ సీఎం అవ్వబోతోందా? మధ్యలో ఎంట్రీ ఇచ్చిన రాఘవ లారెన్స్ సంగతేంటి?

PREV
15
తమిళ రాజకీయాల్లో తగ్గని వేడి..

విజయ్ సీఎం అయ్యి రెండు నెలలు కావస్తున్నా.. తమిళనాడు రాజకీయాలు మాత్రం ఇంకా త్రిష చుట్టునే తిరుగుతున్నాయి. ఆమెపై రకరకాల గాసిప్స్ తెగ తిరిగేస్తున్నాయి. విజయ్, త్రిష బంధంపై ఎవరి ఊహాగానాలు వారు వెల్లడిస్తున్నారు. త్రిష రాజకీయ రంగ ప్రవేశం, ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అఫీషియల్ గా మాత్రం ఎటువంటి సమాచారం బయటకు రావడంలేదు. విజయ్ దళపతి రాజీనామా చేసిన స్థానం నుంచి త్రిష పోటీ చేయబోతున్నదని, గెలిచిన తరువాత తమిళనాడుకు ఆమె డిప్యూటీ సీఎం కాబోతుందంటూ.. రకరకాల ప్రచారాలు జరిగాయి.

25
రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్..?

త్రిష పొలిటికల్ ఎంట్రీపై రకరకాల రూమర్స్ నడుతుస్తుండగానే.. మరో నటుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. త్రిషకు ఆయన చెక్ పెట్టబోతున్నాడని కొందరు అంటే.. లేదు.. విజయ్ మీద ఉన్నఅభిమానం, ప్రజలకు సేవ చేయాలన్న కారణంగా ఆయన TVK పార్టీలో చేరి.. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి స్థానం నుంచి పోటీ చేయనున్నారని కొందరు చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి.

35
పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన లారెన్స్...

ఈ ప్రచారంపై రాఘవ లారెన్స్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియో ద్వారా వెల్లడించాడు. తాను తిరుచ్చి స్థానం నుంచి పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. దీంతో ఆయనపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.రాఘవ లారెన్స్ వివరణతో మరోసారి సోషల్ మీడియా చూపు త్రిష పై పడింది. త్రిష TVK పార్టీ తరఫున తిరుచ్చి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కొందరు నెట్టింట్లో మళ్లీ ప్రచారం స్టార్ట్ చేశారు.

45
త్రిష నిజంగా రాజకీయాల్లోకి రాబోతోందా?

అంతేకాదు త్రిష రాజకీయాల్లోకి అధికారికంగా ప్రవేశించి కీలక బాధ్యతలు చేపట్టవచ్చని కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, ప్రస్తుతం త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పార్టీ అంతర్గత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే వాదనలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తిరుచ్చి ఉపఎన్నిక ద్వారా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై, తరువాత ఉప ముఖ్యమంత్రి లేదా కేబినెట్‌లో కీలక మంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉందని కూడా పోస్టులు బయటకు వస్తున్నాయి. .

55
అధికారిక ప్రకటన మాత్రం లేదు?

ఈ అంశాలపై త్రిష నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే, ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారనే విషయాన్ని TVK పార్టీ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఆమె ప్రస్తుతం తన సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇక రాఘవ లారెన్స్ మాత్రం తన వీడియోలో తన పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ, తాను తిరుచ్చి స్థానం నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories