Renu Desai: రేణు దేశాయ్‌ చేసిన మొదటి సినిమా ఏంటో తెలుసా? బద్రి కాదు, అది చూసే పవన్‌కి జోడీగా ఎంపిక

Published : Jul 02, 2026, 02:32 PM IST

రేణు దేశాయ్‌.. `బద్రి` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆమె హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా కాదట. ఆమెని తీసుకొచ్చింది మరో సంచలన దర్శకుడు. 

PREV
14
`బద్రి` సమయంలో ప్రేమలో పడ్డ పవన్‌, రేణు దేశాయ్‌

రేణు దేశాయ్‌ `బద్రి` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే పవన్‌తో కలిసి నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లు సాగిన వీరి ప్రేమ కథ.. ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్లింది. అయితే వీరికి పెళ్లికి ముందే అకీరా నందన్‌ జన్మించాడు. అప్పటికే పవన్ కి నందినితో వివాహం జరిగింది. ఆమెతో విడాకులు రావడానికి టైమ్‌ పట్టిన నేపథ్యంలో రేణు దేశాయ్‌ని లేట్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ అన్ని రోజులు ఇద్దరు కలిసే ఉన్నారు. అందుకే అకీరా నందన్‌ జన్మించాడు.

24
రేణు దేశాయ్ ఫస్ట్ మూవీ

పెళ్లి తర్వాత మూడేళ్లు ఉన్న ఈ జంట 2012లో విడిపోయింది. ఆ తర్వాత రష్యా నటి అన్నా లెజినోవాని పవన్‌ మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రేణు దేశాయ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ వెనుక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ ఉంది. మొదట మోడలింగ్‌ చేసే రేణు దేశాయ్‌ని ముంబాయి నుంచి తీసుకొచ్చింది దర్శకుడు గీతా కృష్ణ అంట. ఆయన తన `టైమ్‌` మూవీ కోసం తీసుకొచ్చాడట. ఆడిషన్‌ చేశాక, సెట్‌ కాలేదని రిజెక్ట్ చేశాడట. తర్వాత సినిమా చేద్దామని చెప్పాడట. అదే సమయంలో ప్రభుదేవా ఆమెని అడిగారట. దీంతో గీతా కృష్ణ తీసుకొవచ్చు అని సజెస్ట్ చేశాడట. దీంతో ప్రభుదేవా హీరోగా తమిళంలో రూపొందిన `జేమ్స్ పాండ్‌` అనే చిత్రంలో హీరోయిన్‌గా మొదట రేణు దేశాయ్‌ ఎంపికైందట.

34
ఆ సినిమాలో రేణు దేశాయ్‌ని చూసే `బద్రి`కి ఎంపిక

`జేమ్స్ పాండ్‌` మూవీలో ఆమె యాక్టింగ్‌ని చూసి పూరీ జగన్నాథ్‌ `బద్రి` మూవీకి ఎంపిక చేశాడట. పవన్‌తో `బద్రి` చేసేనాటికి ఆ మూవీ షూటింగ్‌ అయిపోయిందట. కాకపోతే రిలీజ్‌ డిలే అయ్యిందని సమాచారం. ఈ లోపు రేణు దేశాయ్‌ నటనని చూసిన పూరీ జగన్నాథ్‌ `బద్రి`లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు గీతా కృష్ణ తెలిపారు. పూరీ ఈ మూవీని వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల కూడా చేశాడు. ఇది ఎంతటి పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అటు పూరీ కెరీర్‌ పెద్ద టర్న్ తీసుకుంది. ఇది ఆయనకు తొలి మూవీ కావడం విశేషం. అనంతరం ఎంతటి స్టార్‌ డైరెక్టర్‌గా ఆయన ఎదిగారో అందరికి తెలిసిందే.

44
రేణు దేశాయ్‌ కమ్‌ బ్యాక్‌

అలా `టైమ్‌` మూవీలో చేయాల్సిన రేణు దేశాయ్‌.. మొదటి సినిమాగా `జేమ్స్ పాండ్‌`లో నటించింది. అనంతరం `బద్రి`తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కానీ `బద్రి`నే మొదట రిలీజ్‌ కావడంతో ఇప్పుడు ఈ మూవీనే ఆమె ఫస్ట్ సినిమాగా భావిస్తున్నారు. రేణు దేశాయ్‌.. `బద్రి` తర్వాత తెలుగులో పవన్‌తోనే `జానీ` చేసింది. అనంతరం సినిమాలు మానేసింది. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఇటీవల `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంలో నటించింది. ఈ మూవీ ఆడలేదు. ఇప్పుడు మళ్లీ నటిగా స్పీడ్‌ పెంచిందని సమాచారం. ప్రస్తుతం ఆమె `16 రోజుల పండుగ` అనే మూవీలో నటిస్తోంది. దీంతోపాటు మరో సినిమా చేస్తున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories