Age Gap: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య చాలా ఎక్కువ ఏజ్ గ్యాప్ కామన్ గా మారింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుంచి చిరంజీవి వరకూ తమకంటే 30 ఏళ్లు చిన్నవారైన తారలతో రొమాన్స్ చేశారు స్టార్ హీరోలు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల ఏజ్ పెద్దగా కాలిక్యులేట్ చేయరు. కానీ హీరోయిన్ కు 30 దాటితే వయసైపోయిందని పక్కన పెడతారు. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారి 40 ఏళ్లు దాటిన నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ హీరోల విషయంలో అలా కాదు.. 70 ఏళ్ల చిరంజీవి, కమల్ హాసన్ , 75 ఏళ్ల రజినీకాంత్ తో పాటు 60 ఏళ్లు దాటిన ఎంతో మంది హీరోలు తమకంటే 30 ఏళ్లకు పైగా వయసు తక్కువ ఉన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్లు తమకంటే 40 ఏళ్లు చిన్నవారైన తారలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. మనవరాలు వయసున్న హీరోయిన్లతో జంటగా నటించింది ఎవరెవరంటే?
26
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులో దూసుకుపోతున్నాడు. కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తున్నాడు మెగాస్టార్. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో జంటగా నటించిన రాధిక, విజయశాంతి లాంటి హీరోయిన్లకు 60 ఏళ్లు దాటిపోయాయి. దాంతో కొత్తగా వచ్చిన హీరోయిన్లు కూడా మెగాస్టార్ తో రొమాన్స్ చేయకతప్పలేదు. యంగ్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబులతో జోడీ కట్టిన తమన్నా, త్రిష, నయనతార లాంటి తారలు.. కాస్త ఏజ్ పెరిగిన తరువాత చిరంజీవి జోడీగా నటించారు. వీరిమధ్య దాదాపు 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.
36
రజినీకాంత్
రజినీకాంత్ కూడా తనకంటే 30 ఏళ్లకు పైగా చిన్నవారైన హీరోయిన్లతో జోడీగా నటించారు. సూపర్ స్టార్, నయనతార జంటగా చంద్రముఖి లాంటి సినిమాలు ర సూపర్ హిట్ అయ్యాయి. నయనతార మాత్రమే కాదు.. రాధిక ఆప్టే లాంటి హీరోయిన్లు కూడా రజినీకాంత్ జంటగా నటించారు. వీరు రజినీకాంటే 30 ఏళ్లు చిన్నవారు. అయితే ప్రస్తుతం ఆయన హీరోయిన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో తమతో నటించిన రమ్యకృష్ణ లాంటి తారలకు అవకాశం ఇస్తున్నారు. 75 ఏళ్ల వయసులో రజినీకాంత్ హీరోయిజం చూపిస్తూనే తాత పాత్రల్లో నటిస్తున్నారు.
ఆంధ్రా అందగాడు, ప్రయోగాలకు పెట్టింది పేరు, టాలీవుడ్ కు టెక్నాలజీని పరియం చేసిన హీరో కృష్ణ కూడా ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నారు. ఆయన కూడా తనకంటే వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్లతో ఆడి పాడాడు. కృష్ణ తనకంటే వయసులో 30 ఏళ్లకు పైగా చిన్నవారైన సౌందర్య, రమ్యకృష్ణ, ఇంద్రజ, ఆమనీలతో జంటగా నటించారు. శోభన్ బాబు కూడా తనకంటే వయసులో చిన్నవారైన హీరోయిన్లతో రొమాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాధ, రాధిక, విజయశాంతి ఇలా చాలామంది హీరోయిన్లు శోభన్ బాబు కంటే 25 నుంచి 30 ఏళ్ల చిన్నవారే.
56
అక్కినేని నాగేశ్వరావు..
ఇక టాలీవుడ్ లో మొదటి తరం హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు ఈ ఇద్దరు తమ మనవరాలు వయసున్న హీరోయిన్లతో ఆడి పాడారు. నాగేశ్వరావు అయితే తనకంటే 40 ఏళ్లు చిన్నవారైన హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. అక్కినేని జంటగా నటించిన రాధిక, రాధ, విజయశాంతి, శ్రీదేవి లాంటి హీరోయిన్లు నాగేశ్వరరావు కంటే నాలుగు దశాబ్దాలు చిన్నవారే.. ఇక శ్రీదేవి అయితే అక్కినేని మనవరాలిగా కూడా నటించింది.
66
నందమూరి తారకరామారావు..
ఇక నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనతో నటిస్తే చాలు స్టార్లు అయిపోతాం అని ఓ సెంటిమెంట్ ఉండేది హీరోయిన్లలో. అందుకే వయసు తేడా లేకుండా ఎన్టీఆర్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. పెద్దాయనతో రొమాన్స్ చేసిన జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లు ఆయనకంటే 40 ఏళ్లకు పైగా చిన్నవారే. శ్రీదేవి అయితే రెండు సినిమాల్లో ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించింది. అప్పట్లో శ్రీదేవి ఎన్టీఆర్ తో హీరోయిన్ గా చేస్తుందని తెలిసి విమర్శలు కూడా వచ్చాయి. ఇండస్ట్రీలో, కామన్ ఆడియన్స్ లో కూడా ఇది హాట్ టాపిక్ అయ్యింది. డైరెక్ట్ గా ఎన్టీఆర్ ను విమర్శించినవారు కూడా లేకపోలేదు. ఇలా చాలామంది హీరోలు తమకంటే 40 ఏళ్లు చిన్నవారైన తారలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు.