బాలయ్య కామెంట్ తో అంతా అయిపోయిందా?.. నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ మరింత దూరమా? ఫ్యాన్స్ లో ఆందోళన

నందమూరి బాలకృష్ణ..ఇటీవల తనని బాబాయ్‌ అని ఎవరైనా అంటే దబిడి దిబిడే అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వారిఫ్యామిలీలోనే దుమారం రేపుతున్నాయి. ఆందోళన కలిగిస్తున్నాయి. 
 

will the gap increase between ntr family after balakrishna babai statement ? fans worry arj
balakrishna

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన `భగవంత్‌ కేసరి` చిత్ర సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌ని రెండు రోజుల క్రితం జరిగింది. సినిమా దాదాపు బ్రేక్‌ ఈవెన్‌ చేరుకోవడంతో టీమ్‌ సక్సెస్‌ ఈవెంట్‌ని నిర్వహించింది యూనిట్‌. ఇందులో బాలయ్య పలు హాట్‌ కామెంట్లు చేశారు. అందులో నన్ను ఎవరైనా వయసులో బాబాయ్‌ అంటే వాళ్లకి దబిడి దిబిడే అని అంటూ వ్యాఖ్యానించాడు. 

will the gap increase between ntr family after balakrishna babai statement ? fans worry arj

బాలయ్య చేసిన ఈ స్టేట్‌మెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. బాలయ్య చేసిన కామెంట్స్ ఎన్టీఆర్‌ని ఉద్దేశించే అని నిర్ధారించుకుంటున్నారు. పరోక్షంగా తారక్‌ తగిలేలానే బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్‌ మీడియాలో కోడై కూస్తున్నారు నెటిజన్లు. రచ్చ రచ్చ చేస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారం రేపుతున్నాయి. పర్సనల్‌గా వెళ్తున్నాయి. 
 


బాలయ్య నోటికి ఏదొస్తే అది చెప్పేస్తాడు, వెనకా ముందు ఏం ఆలోచించరు. ఆ స్టేజ్‌పై ఆయన సడెన్‌గానే ఆ కామెంట్‌ చేశారు. ఆయన ఉద్దేశ్యంలో సరదాగా చేసిన వ్యాఖ్యలు అయినా దాని మీనింగ్‌ మాత్రం అబ్బాయ్‌ తారక్‌కి సింక్‌ అయ్యేలా ఉండటంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు అటు బాలయ్య ఫ్యాన్స్ కి, ఇటు తారక్‌ ఫ్యాన్స్ కి మధ్య వార్‌ జరుగుతుంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ బాలయ్య కామెంట్లని సీరియస్‌ తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఎన్టీఆర్‌ స్పందించలేదు. స్పందించాలనే ఒత్తిడి పెరిగింది, కానీ ఆయన రియాక్ట్ కాలేదు. దీంతో ఆ సమయంలో కూడా `ఐ డోన్ట్ కేర్‌` అంటూ కామెంట్‌ చేశారు బాలకృష్ణ. అంతేకాదు సినిమాలోనూ ఆ డైలాగ్‌ని వాడారు. 

balakrishna ntr

దీంతో `భగవంత్‌ కేసరి` మూవీ సమయలో తారక్‌ ఫ్యాన్స్ దూరంగా ఉన్నారని, ఎంకరేజ్‌ చేయలేదని అన్నారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సపోర్ట్ చేయకపోవడం వల్లే ఆ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోయిందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ చేసిన కామెంట్లు సడెన్‌గా కాదు, కావాలనే అన్నారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నటసింహాం ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది, కానీ ఆయన వ్యాఖ్యల ఫలితం పెద్ద పరిణామాలకు దారితీసేలా ఉంది. 

బాలయ్య వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్ ని పూర్తిగా విడగొట్టేలా ఉన్నాయని అంటున్నారు. ఈ దెబ్బతో పూర్తిగా బాలయ్య ఫ్యాన్స్, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సెపరేట్‌ అయ్యారని అంటున్నారు. సోషల్‌ మీడియాలో వారి మధ్య వార్‌ చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది. మరోవైపు ఈ వ్యాఖ్యలు ఫ్యామిలీ పరంగానూ బాలయ్య, ఎన్టీఆర్‌ మధ్య మరింత దూరం పెంచుతుందనే వాదన తెరపైకి వస్తుంది. అంతకు ముందే బాలయ్య, ఎన్టీఆర్‌ ఫ్యామిలీ మధ్య కొంత గ్యాప్‌ ఉంది. హరికృష్ణ మరణం సమయంలో కలిసినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆ గ్యాప్‌ పెరిగింది. అటు చంద్రబాబు వైపు నుంచి కూడా మనస్పర్థాలు వచ్చాయని సమాచారం. దీంతో బాలయ్య తారక్‌ని దూరం పెడుతూ వస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 

ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలు ఆ దూరాన్ని మరింత పెంచుతాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇది నందమూరి కామన్‌ ఫ్యాన్స్ లో ఆందోళన పెంచుతుంది. బాలయ్య ఉద్దేశ్యం ఏదైనా బయటకు ప్రొజెక్ట్ అయ్యింది మాత్రం ఎన్టీఆర్‌ని ఉద్దేశించే అనేది వాస్తవం. ఫ్యాన్స్ అదే ఫీలవుతున్నారు. అయితే ఒక్కటే ఫ్యామిలీ అన్నప్పుడు వారి మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, ఇప్పుడు దూరం ఉన్నంత మాత్రాన ఎప్పుడూ దూరమవుతారని లేదు. ఏ సందర్భంలో అయినా కలవొచ్చు, అప్పుడు బలయ్యేది, బకరా అయ్యేది మాత్రం అభిమానులే అనేది సత్యం. 
పచ్చ జెండా హిందూపురం తోపాటు ఆంధ్ర మొత్తం ఎగురుతుంది.. భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో రాఘవేంద్ర రావు

Latest Videos

vuukle one pixel image
click me!