పండగ కాంతి మొత్తం పోగేసి నవ్వుల్లో చిందించిన రాశి ఖన్నా... చోళీ లెహంగాలో ఫ్యాన్స్ కి దీపావళి ట్రీట్ 

First Published | Nov 11, 2023, 6:38 PM IST

హీరోయిన్ రాశి ఖన్నా పండగ వేళ సరికొత్తగా తయారైంది. సాంప్రదాయ చోళీ లెహంగా ధరించి దీపపు కాంతుల మధ్య నిలుచుంది. పండగ శోభ మొత్తం ఆమె ముఖంలో కనిపిస్తుంది. 
 

Raashi Khanna

దేశంలో దీపావళి వేడుకలు మొదలైపోయాయి. తారలు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. రాశి ఖన్నా తనదైన శైలిలో ఫ్యాన్స్ కి శుభాకాంక్షలు చెప్పింది. చోళీ లెహంగాలో మనోహరంగా కనిపిస్తూ పండగ ట్రీట్ ఇచ్చింది. రాశి ఖన్నా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. 

Raashi Khanna

మరోవైపు రాశి ఖన్నా కెరీర్ నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర పరిశ్రమల్లో ఆఫర్స్ వస్తున్నా స్టార్ కాలేకపోతుంది. టాలీవుడ్ లో ఆమె జర్నీ ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాశి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. 2022లో రాశి ఖన్నా హీరోయిన్ గా థాంక్యూ, పక్కా కమర్షియల్ విడుదలయ్యాయి. ఇవి రెండు డిజాస్టర్స్ అయ్యాయి. 


Raashi Khanna

ఆ రెండు చిత్రాల పరాజయాలతో రాశి ఖన్నాకు టాలీవుడ్ లో దారులు మూసుకుపోయాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. యోధ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. 

Raashi Khanna

మరోవైపు తమిళంలో అరణ్మణై, మేథావి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 2020 తర్వాత రాశి ఖన్నా తమిళంలో అధికంగా చిత్రాలు చేయడం విశేషం. కార్తీకి జంటగా ఆమె నటించిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

Raashi Khanna

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే రాశి ఖన్నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ పట్టేసింది. హిట్ ట్రాక్ లేకున్నా ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. 

Raashi Khanna

దర్శకుడు బాబీ తెరకెక్కిన జైలవకుశ సూపర్ హిట్ కొట్టింది. అయితే రాశి కెరీర్ కి జై లవకుశ ప్లస్ కాలేదు. ఆమెకు టైర్ టూ హీరోల సరసన మాత్రమే ఆఫర్స్ వచ్చాయి. అదే సమయంలో డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు. రుద్ర టైటిల్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసింది. 

Raashi Khanna

రాశి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ పార్జీ. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేశారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పార్జీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫేక్ నోట్స్ కనిపెట్టే ఎక్స్పర్ట్ గా రాశి ఖన్నా కనిపించారు. 
 

Latest Videos

click me!