Ranbir-Alia Wedding: రణ్‌బీర్‌కి కండోమ్‌ ప్యాకెట్‌ గిఫ్ట్ గా పంపిస్తానన్న దీపికా పదుకొనె.. బాలీవుడ్‌లో దుమారం

Published : Apr 08, 2022, 09:33 PM IST

బాలీవుడ్‌లో చాక్లెట్‌ బాయ్‌గా పేరుతెచ్చుకున్న రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలో `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌ని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు దీపికా పదుకొనె కండోమ్‌ ప్యాకెట్‌ పంపిస్తానన్న కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. దుమారం రేపుతున్నాయి. 

PREV
17
Ranbir-Alia Wedding: రణ్‌బీర్‌కి కండోమ్‌ ప్యాకెట్‌ గిఫ్ట్ గా పంపిస్తానన్న దీపికా పదుకొనె.. బాలీవుడ్‌లో దుమారం

రణ్‌బీర్‌ కపూర్‌,  అలియాభట్‌ గత రెండేమూడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. `బ్రహ్మాస్త్ర` షూటింగ్‌ టైమ్‌ నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ బలపడి, అదిప్పుడు పెళ్లి వరకు వెళ్తుంది. ఈ నెలలోనే మ్యారేజ్‌ జరగబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఏప్రిల్‌ 13 నుంచి 17 వరకు గ్రాండ్‌గా ఈ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేశారట. మరి ఈ వార్తల్లో నిజమెంతా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కానీ రణ్‌బీర్‌-అలియా ఒక్కటి కాబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌ మీడియాలో ఊపందుకున్నాయి. 

27

ఈ సందర్భంగా రణ్‌బీర్‌ కపూర్‌కి సంబంధించిన పాత విషయాలు, ఓల్డ్ లవ్‌ స్టోరీలు తెరపైకి వస్తున్నాయి. కొన్ని విషయాలు హాట్‌ టాపిక్‌గా మారడమే కాదు దుమారం రేపుతున్నాయి. అలియాతో ప్రేమలో పడటానికి ముందు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌లతోనూ డేటింగ్‌ చేశారు రణ్‌బీర్‌ కపూర్‌. మొదట ఆయన దీపికా పదుకొనెతోనే లవ్‌లో ఉన్నారు. 2010 టైమ్‌లో వీరిద్దరు దాదాపు రెండేళ్లపాటు ప్రేమించుకున్నట్టు వార్తలొచ్చాయి. 

37

ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో రణ్‌బీర్‌, దీపికా విడిపోయారు. కొన్ని రోజులకు కత్రినాకి కనెక్ట్ అయ్యాడు రణ్‌బీర్‌. కానీ అంతకంటే ముందే దీపికా పదుకొనె.. రణ్‌బీర్‌పై పలు షాకింగ్‌ కామెంట్లు చేసింది. బ్రేకప్‌ అయిన కోపంలో ఉన్న దీపికా, తన ఫ్రెండ్‌ సోనమ్‌ కపూర్‌తో కలిసి కరణ్‌ జోహార్‌ నిర్వహించే `కరణ్‌ విత్‌ కాఫీ` టాక్‌ షోలో పాల్గొన్నారు. వీరిద్దరు అనేక సరదా విషయాలను వెల్లడించారు. ఈ టైమ్‌లోనే రణ్‌బీర్‌ కపూర్‌ గురించి అడిగారు కరణ్‌. సోనమ్‌ కపూర్‌ని ప్రశ్నించగా, ఆయన తనకు గొప్ప ఫ్రెండ్‌ అని, చాలా రోజులుగా ఫ్రెండ్‌గా అతని గురించి బాగా తెలుసు  అని చెప్పింది సోనమ్‌ కపూర్‌. 
 

47

అయితే ఫ్రెండ్‌గా తెలుసుగానీ, బాయ్‌ ఫ్రెండ్‌గా ఆయనేంటో తనకు తెలియదని వెల్లడించింది. దీపికాని ఉద్దేశిస్తూ, ఆయనతో చాలా కాలంగా ఎంగేజ్‌ అవుతుందని, ఎలా ఉంటాడో ఆమెకే తెలుసు అని పేర్కొంది సోనమ్‌ కపూర్‌. దీనిపై దీపికా రియాక్ట్ అవుతూ రణ్‌బీర్‌పై షాకింగ్‌ కామెంట్‌ చేసింది. తాను రణ్‌బీర్‌కి ఓ కండోమ్‌ ప్యాకెట్‌ని గిఫ్ట్ గా పంపించాలనుకుంటున్నట్టు వెల్లడించి షాకిచ్చింది. తాను ఎప్పుడైనా రణ్‌బీర్‌గా నిద్రలేస్తే మళ్లీ పడుకుంటానని చెప్పింది. అంతేకాదు ఆయనకు శృంగారంలో తక్కువ మార్కులేసింది దీపికా. ఆమె వ్యాఖ్యలకు కరణ్‌తోపాటు సోనమ్‌ సైతం షాకయ్యారు. 

57

ఈ కామెంట్లు విన్న రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రి రిషికపూర్‌(లేట్‌) ఆ సమయంలో స్పందించారు. ఇలాంటి గాసిప్‌ విషయాలపై దృష్టిసారించడం కంటే కెరీర్‌పై ఫోకస్‌ పెడితే బాగుంటుంది. మేం కూడా ఆ షోలో పాల్గొన్నాం. అది చాలా సరదాగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఇలాంటి మురికి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఈ షోలో ఇలాంటి విషయాలు చర్చించి మరింత మురికిగా మార్చాలనుకుంటున్నారా? అంటూ ఘాటుగా స్పందించారు రిషి కపూర్‌. అప్పుడు ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం రేపాయి. ఆ తర్వాత అంతా మర్చిపోయారు. కానీ ఇప్పుడు రణ్‌బీర్‌ అలియాని మ్యారేజ్‌ చేసుకోబోతున్న నేపథ్యంలో మళ్లీ ఆ వీడియోలను, ఆ విషయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో మరోసారి ఇవి హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 

67

రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొనె కలిసి `బచ్నా హే హసీనా`, `యే జవాని హై దీవాని`, `తమాషా` చిత్రాల్లో కలిసి నటించారు. బ్రేకప్‌ తీసుకున్నాక కూడా వీరిద్దరు ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్ పండించడం విశేషం. 

77

రణ్‌బీర్‌తో లవ్‌ బ్రేకప్‌ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌తో ప్రేమలో పడింది దీపికా. వీరిద్దరు చాలా ఏళ్లుగా ప్రేమించుకుని 2018లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. మరోవైపు సినిమా కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు. అలాగే సోనమ్‌ కపూర్‌ సైతం మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories