రవితేజకే ఎందుకిలా జరుగుతుంది.. `ఈగల్‌`కి `ఫిబ్రవరి` టెన్షన్‌.. మాస్‌ మహారాజా సెంటిమెంట్‌ బ్రేక్‌ చేస్తాడా?

Published : Jan 05, 2024, 08:55 PM ISTUpdated : Jan 05, 2024, 09:58 PM IST

మాస్‌ మహారాజా రవితేజ ఇప్పటికే వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు పోయిపోయి డిజాస్టర్‌ సెంటిమెంట్లో పడ్డాడు. ఫిబ్రవరి ఆయన్ని భయపెడుతుంది. 

PREV
16
రవితేజకే ఎందుకిలా జరుగుతుంది.. `ఈగల్‌`కి `ఫిబ్రవరి` టెన్షన్‌.. మాస్‌ మహారాజా సెంటిమెంట్‌ బ్రేక్‌ చేస్తాడా?

రవితేజ ఈ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నాడు. నిర్మాతల మండలి జరిపిన చర్చల్లో మొత్తానికి రవితేజ సినిమా వెనక్కి తప్పుకోవాల్సి వచ్చింది. రవితేజ పెద్ద మనసు, నిర్మాతల అండర్‌ స్టాండింగ్‌తో `ఈగల్‌` మూవీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త డేట్‌ని ప్రకటించారు. ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్టు కొత్త డేట్‌ని ప్రకటించారు. ఆ సమయంలో సోలోగా రావాలని భావిస్తున్నారు. అయితే నిర్మాత మండలి కూడా సోలో రిలీజ్‌కి ప్రయత్నిస్తామని చెప్పంది. 
 

26

దీంతో ఫిబ్రవరి 9న రవితేజ `ఈగల్‌` సోలోగా రావాలని భావిస్తున్నాయి. అయితే ఆ రోజున ఇప్పటికే ప్రకటించిన `టిల్లు స్వ్కైర్‌` సినిమా ఉంది. అయితే తమ సినిమా వాయిదా వేసుకునేందుకు నిర్మాత నాగవంశీ అంగీకరించారట. దీంతో ఫిబ్రవరి 9 నుంచి `టిల్లు స్వ్కైర్‌` తప్పుకోనుంది. మరోవైపు సందీప్‌ కిషన్‌ నటించిన `మాఊరు పేరు భైరవకోన` అనే చిత్రాన్ని కూడా అదే వారంలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ తమని సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని నిర్మాత అనిల్‌సుంకర సీరియస్‌ అవుతున్నారు. తమ సినిమాని విడుదల చేస్తామని ఆయన ప్రటించారు. దీంతో కొత్త వివాదం రాజుకుంటుంది. మరి ఇది ఎలాంటి రచ్చకి దారితీస్తుందో చూడాలి. 
 

36

ఇదిలా ఉంటే రవితేజ సినిమా `ఈగల్‌` ఫిబ్రవరిలో రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు టెన్షన్‌ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందంటున్నారు. ఫిబ్రవరిలో వద్దు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. బ్యాడ్ సెంటిమెంట్‌ ఉన్న నేపథ్యంలో ఆ నెలలో రావడం సరికాదని అంటున్నారు. రిస్క్ వద్దు అంటున్నారు. అందులకు గతాన్ని తోడుతూ మరింత భయపెడుతున్నారు. 
 

46

రవితేజ నటించిన `షాక్‌` మూవీ ఫిబ్రవరిలోనే విడుదలైంది. ఆయన సీరియస్‌గా నటించిన చిత్రమిది. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. ఒక ప్రయోగాత్మకంగా చేశాడు. రిజల్ట్ తేడా కొట్టింది. ఇది విడుదలైంది ఫిబ్రవరి 9, 2006. ఆ తర్వాత 2012లో గుణశేఖర్‌ రూపొందించిన `నిప్పు` సినిమా కూడా ఫిబ్రవరి(17న)లోనే వచ్చింది. యాక్షన్‌ మూవీగా వచ్చి పరాజయం చెందింది. 

56

దీంతోపాటు విక్రమ్‌ సిరికొండ డైరెక్షన్‌లో వచ్చిన రవితేజ యాక్షన్‌ కామెడీ `టచ్‌ చేసి చూడు` మూవీ సైతం ఫిబ్రవరిలోనే వచ్చింది. ఫిబ్రవరి 2న తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. మాస్‌ రాజా ఫ్యాన్స్ ని డిజాప్పాయింట్‌ చేసింది. అలాగే గతేడాది `ఖిలాడి`తోనూ వచ్చారు రవితేజ. ఫిబ్రవరి 11న ఈ మూవీ విడుదలైంది. రమేష్‌ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. హీరోయిన్‌ మీనాక్షి మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.
 

66

ఇలా ఫిబ్రవరిలో రిలీజ్‌ అయిన రవితేజ సినిమాలు డిజాస్టర్‌ కావడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. మళ్లీ అదే సెంటిమెంట్‌ రిపీట్‌ అయితే పరిస్థితేంటి అంటున్నారు. ఫిబ్రవరిలో వచ్చి మళ్లీ రిస్క్ చేయోద్దంటున్నారు. అయితే `ఈగల్‌` మూవీ చూడ్డానికి సీరియస్‌గా కనిపిస్తుంది. రవితేజ మార్క్ వినోదం లేని సినిమాలు పరాజయం చెందాయి. ఇటీవల `టైగర్‌ నాగేశ్వరరావు` పరిస్థితి కూడా అంతే. దీంతో ఇది మరో టెన్షన్‌లా మారింది. దీంతో మళ్లీ రవితేజకి డిజాస్టర్‌ తప్పదా అంటున్నారు. మరి ఆ సెంటిమెంట్‌ని మాస్‌ రాజా బ్రేక్‌ చేస్తాడా? రికార్డు సృష్టిస్తాడా? అనేది చూడాలి. ఇక కార్తిక్‌ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రంలో రవితేజ సరసన కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories