`సలార్‌ 2` టీజర్‌ ఆల్‌ రెడీ రిలీజ్‌.. ఇదేం ట్విస్ట్ సామీ.. ప్రశాంత్‌ నీలా మజాకా!

Published : Jan 05, 2024, 06:51 PM IST

ప్రభాస్‌ నటించిన `సలార్‌` సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. అయితే ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సెకండ్‌ పార్ట్ టీజర్‌.. మొదటి పార్ట్ కి వచ్చిందంటున్నారు.   

PREV
16
`సలార్‌ 2` టీజర్‌ ఆల్‌ రెడీ రిలీజ్‌.. ఇదేం ట్విస్ట్ సామీ.. ప్రశాంత్‌ నీలా మజాకా!

`సలార్‌` సినిమా బాక్సాఫీసు వద్ద పోరాడుతుంది. ప్రభాస్‌ నటించిన ఈ మూవీ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అదరగొడుతుంది. అయితే భారీ కలెక్షన్లు వసూలు చేస్తుందని భావించిన ఈమూవీ బాక్సాఫీసు వద్ద డీలా పడుతుంది. వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని భావించినా ఇది ఇంకా ఏడు వందల కోట్లకు కూడా రీచ్‌ కాలేదు. దీంతో లైఫ్‌ లైమ్‌లో ఇది ఏడు వందల 50కోట్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు. 
 

26

దీంతో సెకండ్‌ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొదటి భాగంలో అసలు కథ లేదు. జస్ట్ కథని పరిచయం చేసి ముగించాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. అసలు ట్విస్ట్ లు, అనేక సస్పెన్స్ అంశాలకు సంబంధించి హింట్‌ ఇచ్చి వదిలేశాడు. అసలు కథ రెండో భాగంలో చెప్పబోతున్నారు. ఈ లెక్కన రెండో పార్ట్ `సలార్‌`లో మెయిన్‌ స్టోరీ ఉండబోతుంది. దేవా, వరధలు ఎందుకు శతృవులుగా మారారు, క్యాలెండర్‌ వెనకాల ఉన్న అసలు సలార్ ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం రెండో పార్ట్ లో ఉండబోతుంది. బలమైన కథ ఉందని అర్థమవుతుంది. 
 

36

అయితే కొంత కన్‌ఫ్యూజన్‌లోనూ పెట్టారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. అనుకోకుండా జరిగిందా? కావాలనే చేశాడా? అనే దానిపై క్లారిటీ రావాల్సి, కానీ ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని వదిలేశాడు దర్శకుడు. `సలార్‌` మొదటి భాగంలో టీజర్‌ విడుదల చేశారు. తిన్ను ఆనంద్‌.. విలన్లకి డైనోసార్‌ గురించే సీన్‌ తో టీజర్‌ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ పంచ్‌ ని చివర్లో చూపించారు. ప్రభాస్‌ని మొత్తం చూపించలేదనే విమర్శలు వచ్చాయి. 
 

46

అయితే ఈ సీన్‌ మొదటి సినిమాలో ఎక్కడా కనిపించలేదు. ఆ ఎలివేషన్‌ సీనే లేదు. ఇది అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇదే కాదు, సినిమా ఫస్ట్ లుక్‌ సీన్‌ లేదు, నిలబడి శతృవులను నరికే సీన్‌ లేదు. పెద్ద మీసాలతో ఉండే ప్రభాస్‌ ఎక్కడా కనిపించలేదు. దీంతో అదంతా రెండో పార్ట్ లోని సీన్లు అని తెలుస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ కన్‌ ఫ్యూజన్‌లో అది విడుదల చేసి ఉంటాడని అంటున్నారు. కానీ సినిమా హైప్‌కి, ఫ్యాన్స్ ఊపు మధ్య అవన్నీ కొట్టుకుపోయాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. సినిమాకి భారీ బజ్‌, పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పుడు లాజిక్‌లు అన్నీ పక్కకు పోతాయి. ఇప్పుడు `సలార్‌` మొదటి పార్ట్ విషయంలోనూ అదే జరిగింది. 
 

56

ఇవన్నీ రెండో పార్ట్ లో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. అంతేకాదు ఇందులో సీనియర్‌ ప్రభాస్.. అంటే అసలు సలార్‌ కనిపిస్తాడని తెలుస్తుంది. సీనియర్‌ సలార్‌ని రాజా మన్నార్‌ ఎలా చంపాడు, రాజ్యం అప్పగించకుండా ఎలా కుట్ర చేశాడనేది ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సమ్మర్‌ నుంచే రెండో పార్ట్ ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

66

ప్రభాస్‌ నటించిన `సలార్‌` సినిమా విడుదలై రెండు వారాలు అవుతుంది. ఇప్పటి వరకు ఇది 660కోట్లు కలెక్ట్ చేసింది. 300కోట్ల షేర్‌ సాధించింది. ఇంకా నాలభైకోట్ల సేర్‌ రావాలి. మరో దీంతో ఆల్మోస్ట్ ఇది బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఇక ఇందులో ప్రభాస్‌తోపాటు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ముఖ్య పాత్ర పోషించగా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి, ఝాన్సీ, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories