Prabhas - Maruthi : ప్రభాస్ - మారుతీ సినిమా... స్టోరీ లైన్ లీక్!

Published : Jan 05, 2024, 07:55 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ సినిమాపై మొత్తానికి అపీషియల్ అప్డేట్ అందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా అందింది. 

PREV
17
Prabhas - Maruthi : ప్రభాస్ - మారుతీ సినిమా... స్టోరీ లైన్ లీక్!

‘సలార్’ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas లైనప్ లోని మారుతీ మూవీపై అఫీషియల్ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాబోతోంది. 

27

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్ నుంచి వరుసగా పిక్స్ వైరల్ అవుతూ వచ్చిన విషయం తెలిసిందే. ట్రెండీ లుక్ లో డార్లింగ్ అదరగొట్టారు. కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ ల్లో ఆకట్టుకున్నారు. 

37

ఇక ఎట్టకేళలకూ ఈ చిత్రం నుంచి అఫీషియల్ అప్డేట్ రావడం, సంక్రాంతి రోజున ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ కూడా రాబోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఇంతకీ ఎలాంటి సినిమా రాబోతుందనే ఆసక్తి నెలకొంది.
 

47

ఈ క్రమంలో Maruthi ప్రభాస్ ను చాలా హ్యాండసమ్ గా చూపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఎలాంటి జోనర్ లో సినిమా రాబోతుందనేది ఇంట్రెస్టింగ్ మారింది. ఈ సందర్భంగా స్టోరీ లైన్ లీక్ అయ్యింది. 

57

స్వయంగా రెబల్ స్టార్ ప్రభాసే అభిమానుల కోసం చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభాస్ - మారుతీ సినిమా ‘హార్రర్ అండ్ కామెడీ’ జోనర్ లో రాబోతుంది. ఇప్పటి వరకు డార్లింగ్ ఈ జోనర్ లో అలరించలేదు. దీంతో సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తిని రేకిస్తోంది. 

67

ఇక మూవీ షూటింగ్ కూడా కొనసాగుతూనే ఉంది. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’కు హాజరవుతూనే.. డేట్స్ ఖాళీగా ఉన్న సమయంలో మారుతీ డైరెక్షన్ లోనూ డార్లింగ్ నటిస్తూనే వస్తున్నారు. చాలా వరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. 

77

ప్రస్తుతం ఫ్యాన్స్ టైటిల్, ఫస్ట్ లుక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మాళవికా మోహనన్, మరో హీరోయిన్ నటిస్తున్నారని తెలుస్తోంది. ‘రాజా డిలాక్స్’ టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక అఫీషియల్ అప్డేట్ ఎలా ఉంటుందో చూడాలి.  

Read more Photos on
click me!

Recommended Stories