ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... ఆటోలో శౌర్య వాళ్ళ బాబాయ్ పిన్ని సౌర్యని, మేము ఊరికే అన్నామమ్మా మేము నిన్ను అప్పుడప్పుడు వచ్చి కలుస్తాము. నువ్వా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అంటారు. అప్పుడు శౌర్య, ఎందుకు ప్రతిసారి తిరిగి తిరిగి ఆ ఇంటి వరకే వస్తారు నాకు వెళ్లడం ఇష్టం లేదు అని చెప్పిన సరే అంత బలవంతం పెట్టి నచ్చజెప్పి మరి తీసుకెళ్తున్నారు హిమ ఉన్న ఇంట్లో నేను ఉండలేను అని సౌర్య అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ, నాకు పుట్టిన బాబు రోజుల్లోనే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు.