హీరో అవ్వాల్సిన శోభన్ బాబు కొడుకు.. ఇండస్ట్రీకే దూరమయ్యాడు? కారణం ఎవరో తెలుసా?

First Published | Apr 2, 2024, 7:11 PM IST

టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు (Sobhan Babu) కొడుకు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే టాప్ హీరోగా నిలవాల్సిన వాడు. కానీ ఆయన్ని చిత్ర పరిశ్రమలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. అందుకే సినిమాలకు ఆయన దూరంగా ఉన్నారు.

టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయన తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అప్పటి హీరోలతో పోటీపడి సినిమాలు తీశారు.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా సినిమాలు తీసి లక్షలాదిమంది అభిమానులు సొంతం చేసుకున్నారు. కుటుంబ నేపథ్య సినిమాలతో ఎంతగానో అలరించారు. హీరో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేశారు.


శోభన్ బాబు హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయ్యారు. అయితే ఆయన కొడుకు కరుణ శేషు (Karuna seshu) కూడా సినిమాల్లోకి వస్తారని శోభన్ బాబు అభిమానులు ఆశించారు.

కానీ అందుకు భిన్నంగా కరుణ శేషు (Karuna  Seshu)  కెరీర్ ఏర్పడింది. ఆయన సినిమాల్లోకి రాకుండా పలు వ్యాపారాలు స్థిరపడ్డారు. ఇందుకు కారణం ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్లే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఉన్నారు. ఇండస్ట్రీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.

శోభన్ బాబు కొడుకు సినిమాలోకి రాపోవడానికి కారణం మరెవరో కాదు శోభన్ బాబు నే. ఈ విషయాన్ని సినీ ప్రముఖులు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ వస్తున్నారు. తన కొడుకు సినిమాల్లో కాకుండా వ్యాపారం లో రాణించాలని శోభన్ బాబు భావించాడంట. 
 

కొడుకుకు సినిమాలోకి రావాలని కాస్త ఆసక్తి ఉన్న దాన్ని పక్కన పెట్టేసి.. బిజినెస్ లో మెలకువలు నేర్పించి తమకున్న వ్యాపారాలను చూసుకోమని చెప్పారంట. అందుకే కరుణ శేషు సినిమా ఇండస్ట్రీ లోకి రాలేకపోయారు. లేదంటే ప్రస్తుతం స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేవారని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Latest Videos

click me!