రాకేష్ మాస్టర్ రెండో భార్య అలా దూరమైతే.. మూడో భార్య జైల్లో పెట్టించాలని చూసింది.. ఏమైందంటే?

First Published | Jun 18, 2023, 7:34 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. అయితే రాకేష్ మాస్టర్ మూడు పెళ్లిళ్ల గురించి కొన్ని డిటేయిల్స్  ఇలా ఉన్నాయి. ఆయన రెండో భార్య, మూడో భార్యతో ఎందుకు విడిపోయారంటే..
 

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ (Rakesh Master)  కొద్ది సేపటి కింద మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా కన్నుమూశారు. అయితే ఆయన రెండో భార్య, మూడో భార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 
 

రాకేష్ మాస్టర్ 1968లో తిరుపతిలో జన్మించారు. 1500కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ఆయన 53 ఏళ్లలో మరణించారు. ఆయన మరణంతో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తున్నారు. 


ఇదిలా ఉంటే.. రాకేష్ మాస్టర్ మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకుంటే.. మాస్టర్ కు మూడు పెళ్లిళ్లు జరిగినట్టు తెలుస్తోంది. మొదటి భార్య పెద్దగా మీడియాకు పరిచయం లేదు. కానీ ఆమె రెండో భార్య, కొడుకు చరణ్ గురించి తెలిసే ఉంటుంది. 
 

ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులపై రాకేష్ మాస్టర్ చేసిన తీవ్ర విమర్శలతో రెండో భార్యకు దూరం కావాల్సి వచ్చింది. లాక్ డౌన్ లో తన కొడుకు చరణ్ తో పాటు యూట్యూబ్ లో రాకేష్ మాస్టర్ సందడి చేసిన విషయం తెలిసిందే. కొద్ది కాలంగా దూరంగా ఉండటంతో మూడో పెళ్లి కూడా చేసుకున్నారు. 
 

రాకేష్ మాస్టర్ రాజుల కుటుంబానికి చెందిన లక్ష్మి అమ్మను పెళ్లి చేసుకున్నారు. వీరి మ్యారేజ్ రెండేళ్ల కింద జరిగింది. ఆ సమయంలో నేరుగా ఓ స్టూడియోలోకి పూలదండలో వచ్చి  సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆమెతోనూ రాకేష్ మాస్టర్ విడిపోవాల్సి  వచ్చింది. అందుకు కారణాలను కూడా చెప్పుకొచ్చారు. ఒకనొక దశలో ఆయన్ను జైల్లో పెట్టించాలని కూడా చూసిందని ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. 
 

పెళ్లి సమయంలో అన్నీ తానే అని చెప్పుకొచ్చిన రాకేష్ మాస్టర్  కొద్దిరోజులకే అభిప్రాయ విభేదాలతో విడిపోయారు. ఆయన శిష్యుడైన ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ కోసం గొడవ మొదలై ఆ తర్వాత కొన్ని ఘర్షణల తర్వత విడిపోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొద్దికాలంగా రాకేష్ మాస్టర్ ఒంటిగానే ఉంటున్నారు. యూట్యూబ్ స్టార్స్ తో సందడి చేస్తూ కనిపిస్తున్నారు. 
 

Latest Videos

click me!