ఆ పాత్ర చేయనని, హిట్ సీక్వెల్ రిజెస్ట్ చేసిన సమంత, షాకింగ్ రీజన్

Published : Jul 01, 2024, 09:19 AM IST

అయితే తనకు స్క్రిప్టు నచ్చింది కానీ తాను ఆ పాత్రలు చేయనని సమంత తేల్చి చెప్పిందని సమాచారం. అందుకు కారణం ఒకసారి అలాంటి పాత్రలో తనను చూస్తే ..

PREV
110
 ఆ పాత్ర చేయనని, హిట్ సీక్వెల్ రిజెస్ట్ చేసిన సమంత, షాకింగ్ రీజన్

అతి తక్కువ కాలంలోనే తనకంటూ  ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరూ అంటే సమంత. సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే  సమంత కు వరస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అందులోనూ ఆమె సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ వెబ్ సీరిస్ లతో పాపులర్ అవటంతో ఆమెను ఎంచుకునే దర్సక,నిర్మాతల లిస్ట్ పెరిగిపోతోంది. అయితే తన డేట్స్ చాలా ఛూజీ గా ఇస్తోంది సమంత. అలాగే కొన్ని పాత్రలు చేయనని తెగేసి చెప్తోంది. తాజాగా ఆమె ఓ పాత్రను రిజెక్ట్ చేసిందని సమాచారం. ఎవరా డైరక్టర్..ఏమా కథ..ఏ పాత్ర అనేది చూస్తే...
 

210
samantha

రీసెంట్ గా సమంతను తమిళ దర్శకుడు,నటుడు  ఆర్జే బాలాజీ కలిసారని తమిళ సినీ వర్గాల సమాచారం. ఆయన దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో  2020లో విడుదలైన తెలుగు సినిమా అమ్మోరు తల్లి . తమిళంలో ‘మూకుత్తి అమ్మన్‌’గా విడుదలైన ఈ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తే మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసారు.  ‘మూకుత్తి అమ్మన్‌’-2 టైటిల్ తో స్క్రిప్టు రాసుకుని ఈ సారి నయనతార చేసిన అమ్మవారి పాత్రలో సమంత చేత చేయించాలని ఎప్రోచ్ అయ్యారట.

310

అయితే తనకు స్క్రిప్టు నచ్చింది కానీ తాను దేవతల పాత్రలు చేయనని సమంత తేల్చి చెప్పిందని సమాచారం. అందుకు కారణం ఒకసారి అలాంటి పాత్రలో తనను చూస్తే ఇంక తనలో గ్లామర్ యాంగిల్ చూడటానికి ఎవరూ ఆసక్తి చూపించరని సమంత భావించారట. బాలీవుడ్ లో ఆమె మెల్లిగా హీరోయిన్ గా సెటిల్ అవుదామనే ఆలోచనలో ఉన్నారట. సల్మాన్, షారూఖ్ వంటి స్టార్స్ సరసన చేయాలని ఆమె ఉత్సాహం చూపించబట్టే ఈ పాత్రకు నో చెప్పారంటున్నారు. 

410

ఇదిలా ఉంటే ఆమె యశోద, ఓహ్ బేబి , మా ఇంటి బంగారం వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో చేస్తోంది. ఇక సమంత  త్వరలో ‘సిటాడెల్‌:హనీ బన్నీ’తో తనలోని యాక్షన్‌ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడామె మరో కొత్త వెబ్‌సిరీస్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమెతో కలిసి బాలీవుడ్‌ హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌ నటిస్తున్నట్లు సమాచారం. 

510

‘‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘సిటాడెల్‌’ సిరీస్‌ల కోసం రాజ్‌ అండ్‌ డీకేలతో చేతులు కలిపిన సమంత..మరోసారి తన రాబోయే ప్రాజెక్టు కోసం వారితో కలిసి పనిచేయనుంది. పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో వచ్చే సీక్వెన్స్‌ కోసం ఇప్పటికే ఆదిత్య, సమంత కసరత్తులు కూడా ప్రారంభించారు. దీనికి ‘రక్తబీజ్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఆగస్టులో షూటింగ్  మొదలుపెట్టనున్నారు’’ అని చెప్తున్నారు. 

610

ఆదిత్య రాయ్ కపూర్ ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు.  అతనికి ఇది సెకండ్ వెబ్ సిరీస్ కావడం విశేషం. గత ఏడాది గుమ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ప్రస్తుతం మెట్రో అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇందులో ఆదిత్య రాయ్ కి జోడీగా సారా అలీఖాన్ నటిస్తోంది.

710

 మరో వైపు సమంత సిటాడెల్ కంప్లీట్ చేసిన తర్వాత తన ప్రొడక్షన్ లోనే బంగారం అనే మూవీని ఎనౌన్స్ చేసింది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. సమంత రీ ఎంట్రీ ఈ  సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోనే ఆమె కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కనుంది. 

810

సమంత పుట్టినరోజు సందర్భంగా   ‘మా ఇంటి బంగారం’ సినిమాని పోస్టర్‌తోపాటు పేరు ప్రకటించారు. అందులో గన్‌ చేతపట్టిన గృహిణిగా కనిపిస్తున్నారు సమంత. ‘‘బంగారం అనిపించుకోవాలంటే ప్రతీదీ మెరిసిపోవల్సిన అవసరం లేదు’’ అనే  ట్యాగ్ లైన్ తో ఈ సినిమాని ప్రకటించారు సమంత. 

910
Samantha

‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. అనారోగ్యం కారణంగా కొన్ని నెలలపాటు విరామం తీసుకున్న ఆమె, మళ్లీ మునుపటిలా నాజూగ్గా సిద్ధమై కెమెరా ముందుకొస్తున్నారు. పలువురు అగ్ర హీరోల సినిమాల విషయంలో సమంత పేరు వినిపించినా, నాయికా ప్రధానమైన సినిమాతోనే ఆమె రీఎంట్రీ  చేస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్ర దర్శకుడు ఎవరు? ఇతరత్రా విషయాలేమిటనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు.
 

1010

తన అద్భుతమైన నటనతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.అయితే ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ లో వచ్చిన కొన్ని సమస్యల కారణంగా ఆమె కొంతకాలం సినిమాలకు దూరం అయింది. తాజాగా సమంత మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కానుంది.గత ఏడాది సమంత శాకుంతలం ,ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి.

Read more Photos on
click me!

Recommended Stories