ఏదైమైనా వరుణ్ తేజ్ ప్రయోగాలు కాకుండా కమర్షియల్ సినిమాలు చేసినపుడు ఓపెనింగ్స్, కలెక్షన్స్ అదిరిపోయాయి. ఆరేళ్ల కింద తొలిప్రేమ సినిమాకు మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ వచ్చింది.. దాని తర్వాత గద్దలకొండ గణేష్ సినిమాకు ఫస్ట్ డే 11 కోట్ల గ్రాస్ వచ్చింది. మిస్టర్ సినిమాకు కూడా 5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ అంతరిక్షం, కంచె, గాంఢీవదారి అర్జున, గని లాంటి సినిమాలు మాత్రం దారుణమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. ఫుల్ రన్‌లోనూ వీటి పరిస్థితి మారలేదు. దాంతో ఇప్పుడు మరో ప్రయాగాత్మక చిత్రంఅంటే ప్యాన్స్ కంగారుపడటంలో వింతేముంది.