బర్త్ డే వేళ విజయ్ దేవరకొండకు రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక షాక్... హ్యాండ్ ఇచ్చినట్లేనా?

Published : May 11, 2023, 02:02 PM IST

విజయ్ దేవరకొండ-రష్మిక మందాన రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతుంది. అయితే రష్మిక ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

PREV
16
బర్త్ డే వేళ విజయ్ దేవరకొండకు రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక షాక్... హ్యాండ్ ఇచ్చినట్లేనా?
Rashmika Mandanna

రష్మిక మందాన అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. టాలీవుడ్ లో అడుగుపెట్టాక ఆమెకు కలిసొచ్చింది. వరుస హిట్స్ తో టాప్ హీరోయిన్ అయ్యారు. అదే స్థాయిలో ఆమె వివాదాల్లో ఇరుకున్నారు. రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. ఈ చిత్ర హీరో రక్షిత్ శెట్టిని రష్మిక ప్రేమించారు. ఎంగేజ్మెంట్ జరిగాక అతనికి బ్రేకప్ చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసింది. రష్మిక మీద రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆమెను ట్రోల్ చేశారు. 
 

26

తెలుగు పరిశ్రమకు వచ్చాక హీరో విజయ్ దేవరకొండకు దగ్గరయ్యారనే వాదన ఉంది. పలుమార్లు రష్మిక-విజయ్ జంటగా కనిపించారు. ముంబైలో డిన్నర్ నైట్స్ కి వెళుతూ మీడియా కంటపడ్డారు. విజయ్ ఇంట్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా రష్మిక హాజరవుతారు. 

36
Vijay Devarakonda-Rashmika Mandanna

రెండు పర్యాయాలు విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. అక్కడ ఒకే హోటల్ గదిలో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈ విషయాన్ని ఒప్పుకున్న రష్మిక మిత్రులు కలిసి టూర్స్ కి వెళితే తప్పేంటి  అంటూ ఎదురు ప్రశ్నించింది. రష్మిక బర్త్ డేను విజయ్ దేవరకొండ దగ్గరుండి సెలబ్రేట్ చేశారు.

46


మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే. రష్మిక మందాన కనీసం సోషల్ మీడియాలో కూడా విషెష్ చెప్పలేదు. విజయ్ దేవరకొండ ఆమె బర్త్ డే పార్టీ గ్రాండ్ గా దగ్గరుండి నిర్వహించాడు. రష్మిక విజయ్ దేవరకొండకు ఎందుకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే చర్చ నడుస్తుంది. ఇద్దరికీ చెడిన పక్షంలో డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారని, అందుకే రష్మిక విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదంటున్నారు. 
 

56

ఆ మధ్య విజయ్ దేవరకొండకు బ్రేకప్ చెప్పిన రష్మిక మరో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి దగ్గరయ్యారన్న వార్తలు వినిపించాయి. సాయి శ్రీనివాస్-రష్మిక ముంబైలో రెండు మూడు సందర్భాల్లో కలిసి కనిపించారు. దీంతో ఎఫైర్ వార్తలు గుప్పుమన్నాయి. ఈ కారణంగానే విజయ్ దేవరకొండకు రష్మిక బర్త్ డే విషెస్ చెప్పలేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

66

అయితే అదేమీ లేదు. పుకార్లకు చెక్ పెట్టేందుకే విజయ్ దేవరకొండను రష్మిక విష్ చేయలేదని మరో వాదన వినిపిస్తోంది. విజయ్ దేవరకొండకు పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే మరలా అఫైర్స్ అంటూ మీడియా గోల చేస్తుంది. అందుకే నేరుగా ఫోన్ చేసి విజయ్ దేవరకొండకు రష్మిక బర్త్ డే విషెష్ చెప్పారట. విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్ కొనసాగుతుందట. 
 

click me!

Recommended Stories