నాగార్జున కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా శివ. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. అయితే శివ మూవీలో మోహన్ బాబు నటించాల్సి ఉందని మీకు తెలుసా? ఈసినిమాలో ఆయన మిస్ అయిన పాత్ర ఏదో తెలుసా?
టాలీవుడ్ చరిత్రలో గేమ్ ఛేంజర్‌గా నిలిచిన సినిమాల్లో శివ ఒకటి. అక్కినేని నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలైంది. నాగార్జున ఇంకా స్టార్ హీరో అవ్వలేదు.. వర్మ కొత్త దర్శకుడు కావడంతో.. ఆ సమయంలో ఈ సినిమా మీద ఎటువంటి అంచనాలు లేవు. ఏమాత్రం బజ్ లేకుండా విడుదలైన శివ సినిమా ఆ తరువాత మెల్లిగా సంచలన విజయం వైపు అడుగులు వేసింది. అనుకున్నదాని కంటే ఎన్నో రెట్లు విజయం సాధించి, తెలుగు సినిమాకు సరికొత్త దిశ చూపించింది.
25
ఎటువంటి అంచనాలు లేకుండానే..
శివ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే.. మార్నింగ్ షోకు కనీసం 30 శాతం బుకింగ్స్ కూడా లేవు.. కానీ సినిమా రెండు షోలు పడిన తరువాత అవి పెరుగుతూ వచ్చాయి. సినిమా బాగుందన్న అభిప్రాయం ఆడియన్స్ లో వచ్చిన తరువాత.. మౌత్ టాక్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి షోకీ ప్రేక్షకులు పెరుగుతూ వచ్చారు.. సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. సాయంత్రానికి క్రౌడ్ కంట్రోల్ అవ్వలేదు.. దాంతో థియేటర్లు పెంచాలని బయ్యర్ల దగ్గర నుంచి డిమాండ్ రావడం మొదలైంది. ఈ పరిణామం అక్కినేని నాగేశ్వరరావుతో పాటుగా ఈ సినిమాను నిర్మించిన నాగార్జున అన్న.. అక్కినేని వెంకట్‌ను ఆశ్చర్యపరిచింది. అయితే నాగార్జున మాత్రం ఇది ముందుగానే ఊహించారు. ఆయనకు మొదటి నుంచే ఈ కథపై పూర్తి నమ్మకం ఉంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాన్ఫిడెంట్ చూసిన నాగ్.. ఆయన చెప్పిన ప్రతి నిర్ణయానికి సపోర్ట్ ఇస్తూ వచ్చారు.
35
శివ సినిమాలో మోహన్ బాబు మిస్సైన పాత్ర
శివ సినిమా టైమ్ లో ఓ కీలక పరిణామం జరిగింది. అదేంటంటే.. సీనియర్ హీరో మోహన్ బాబును శివ సినిమాలోకి తీసుకోవాలి అనుకుని తీసుకోకపోవడమే. ‘శివ’ సినిమాలో గణేష్ అనే పాత్ర ఉంది. ఈ పాత్రలో విశ్వనాథ్ నటించారు. కానీ ఈ క్యారెక్టర్ కోసం ముందుగా ఎవరినీ ఎంపిక చేయలేదు.. అసలు ఈ పాత్రకు మోహన్ బాబుని తీసుకోవాలి అని నిర్మాత వెంకట్ పట్టుపట్టారట. ఈ సినిమాలో ఈ పాత్ర సన్నివేశం ప్రకారం గణేష్ అనే రౌడీ, నాగార్జున పాత్ర అయిన శివకు వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పాత్రకు బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడు అవసరమని నిర్మాత అక్కినేని వెంకట్ అనుకున్నారు.. అందుకే అప్పటికి ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న మోహన్ బాబు ఈక్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతాడని ఆయన అనుకున్నారు.
గణేష్ పాత్రకు మోహన్ బాబు సరైన ఎంపిక కాదు అన్నది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం. ఇదే విషయాన్ని నిర్మాతలకు తెలిపారు ఆర్జీవి. ఆయన వెర్షన్ ప్రకారం, “మోహన్ బాబు వంటి స్థాయి ఉన్న నటుడు ఆ సన్నివేశంలో కనిపిస్తే ప్రేక్షకులు పాత్రను కాదు, మోహన్ బాబునే చూస్తారు. దాంతో కథా బలం తగ్గిపోతుంది. కొత్త నటుడు అయితే ప్రేక్షకులు ఆ వ్యక్తిని రౌడీగా అంగీకరిస్తారు,” అని లాజికల్ గా చెప్పి అందరిని ఒప్పించాడు. దాంతో ఈ పాత్ర కోసం కొత్త నటుడు విశ్వనాథ్ ని ఎంపిక చేశారు. ఈ నిర్ణయం తర్వాత సినిమా మొత్తం మరింత సహజంగా, నిజ జీవితానికి దగ్గరగా కనిపించింది. మోహన్ బాబు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ, ‘శివ’ సినిమా విజయాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు.
55
4K లో రీరిలీజ్
శివ చిత్రం రిలీజ్ తరువాత రామ్ గోపాల్ వర్మకు దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కగా, నాగార్జున కెరీర్ ను ఈసినిమా మలుపు తిప్పింది. ఈ సినిమా ప్రభావంతో తెలుగు సినిమాల్లో టెక్నికల్ మార్పులు, రియలిస్టిక్ మూవీస్ మొదలయ్యాయి. ఇక ఈరోజు (05 అక్టోబర్ ) శివ రిలీజ్ అయ్యి 36 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. కల్ట్ క్లాసిక్ సినిమాను తిరిగి 4K క్వాలిటీలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేయడానికి ఈ సిసినిమా మరింత హంగులతో విడుదలవుతోంది.