మరీ ముంఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ డమ్ చూసిన సమంత.. ఇప్పుడు బాలీవుడ్ ను గట్టిగా ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో వరుసఆఫర్లు సాధిస్తోంది. స్టార్ హీరోల ఇమేజ్ తో ఆమె దూసుకుపోతోంది. ఈరకంగా చూసుకుంటే ప్రభాస్ లాగే సమంత కూడా పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని పలువురు స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.
టాలీవుడ్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు.. నాగ చైతన్య, నాని, విజయ్ దేవరకొండ లాంటి 2 టైర్ హీరోలతో కూడా నటించి మెప్పించింది సమంత. ఇక తమిళం విషయానికి వస్తే.. సూర్య, ధనుష్, విజయ్, విశాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది సమంత.