Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
'పుష్ప-2' ది రూల్ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కలయికలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసుకోవడమే ఈ క్రేజ్‌కు కారణం. ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప-2పై ఎక్సపెక్టేషన్స్ కూడా బాగానే వున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ న్యూస్ ఇచ్చారు నిర్మాతలు . మొదటగా నిర్మాతలు ఈ చిత్రాన్ని డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
పుష్ప 2 ప్రీమియర్స్ ఎప్పుడంటే..
అయితే ఇప్పుడు చిత్రాన్ని ఒకరోజు ముందుగా అంటే డిసెంబరు 5న ఇండియాలో, డిసెంబరు 4న ఓవర్సీస్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరు 5 అర్థరాత్రి నుంచి ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రం ప్రీమియర్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇక రేపు అనగా అక్టోబర్ 24న హైదరాబాద్‌లో జరిగే పుష్ప-2 ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ విషయాన్ని వెల్లడించారు. వారితోపాటు డిస్ట్రిబ్యూటర్లు సమావేశంలో పాల్గొన్నారు.
పుష్ప 2 రిలీజ్ ముందు రోజే ఎందుకంటే
ఒక రోజు ముందుగానే విడుదల చేయడానికి కారణం? చెప్తూ నిర్మాతలలో ఒకరైన నవీన్ మాట్లాడుతూ... యూఎస్‌లో బుధవారం నుంచి షోస్ ప్రారంభమైతే లాంగ్ వీకెండ్ కలిసొస్తుందనే ఉద్దేశంతో ముందుగా విడుదల చేయబోతున్నాం. ఇక్కడా ఒక రోజు ముందు విడుదలకావడం కలిసొచ్చే అంశం. అయినా ‘పుష్ప’ ఎప్పుడు విడుదలైతే అప్పుడే పండగ కదా! డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి తీసుకున్న నిర్ణయమిది అన్నారు.
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
పుష్ప 2 పెండింగ్ షూట్
ఇక చాలా కాలంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికీ షూట్ మిగిలి ఉందంటున్నారెందుకు? అన్నదానికి నవీన్ సమాధానం ఇస్తూ...కారణం ఏముంటుంది? మంచి క్వాలిటీ సినిమా ఇవ్వాలనేదే మా ప్రయత్నం. షూటింగ్ మధ్యలో కొంత విరామం వచ్చింది. పర్‌ఫెక్షన్ కోసం కాస్త ఆలస్యమైంది. కానీ, అవుట్‌పుట్ సంతృప్తినిస్తుంది అన్నారు.
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
పుష్ప 2 జాతర ఎపిసోడ్
అలాగే ‘పుష్ప 2’ విషయంలో జాతర ఎపిసోడ్‌పై ఎక్కువగా చర్చ సాగుతోందన్న విషయమై మాట్లాడుతూ.. ఆ ఎపిసోడ్ చిత్రీకరణకు దాదాపు 35 రోజులు పట్టింది. దాని కోసం రిహార్సల్స్ కూడా చేశారు. ఈ ఎపిసోడ్ విషయంలోనే కాదు ప్రతి సన్నివేశం కోసం దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు. అందరూ ఊహిస్తున్నట్టే ఆ ఎపిసోడ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. డిమాండ్ మేరకే బడ్జెట్ పెట్టాం.
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
పుష్ప 2 స్పెషల్ సాంగ్
ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో ఎవరు నటిస్తున్నారు?అనే విషయమై మాట్లాడుతూ.. ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. తుది దశ చిత్రీకరణలో ఆ పాటే మిగిలి ఉంది. నవంబరు 4 నుంచి షూట్ చేయాలనుకుంటున్నాం. రెండు రోజుల్లో ఆ వివరాలు ప్రకటిస్తాం. అలాగే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 1000 కోట్లు క్రాస్ అయిందనే వార్తలొస్తున్నాయి. నిజమేనా? అంటే...థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి అలా చెబుతున్నారు. అయితే, నాన్ థియేట్రికల్ విషయంలో ఇప్పటి వరకూ ఏ సినిమా చేయని బిజినెస్ చేసింది అని చెప్పుకొచ్చారు.
పుష్ప 2 రీ షూట్
కొన్ని సీన్స్ రీ షూట్ చేశారనే టాక్ విషయమై మాట్లాడుతూ... హీరో యాటిట్యూడ్, డైలాగ్స్ ప్రధానంగా రూపొందుతున్న సినిమా ‘పుష్ప 2’. ఆ క్యారెక్టరైజేషన్‌కు తగ్గట్టే ఆయా సన్నివేశాలను గ్రాండ్‌గా చూపించబోతున్నాం. కావాలని ఏదీ పెట్టడంలేదు. పార్ట్ 1లో సీన్స్ పార్ట్ 2లో వినియోగించడం, రీ షూట్ అంటూ ఏం లేదు అని తేల్చేసారు.
పుష్ప 2 టికెట్ ధరల పెంపు
చివరగా..పుష్ప 2 టికెట్ ధరల పెంపు గురించి మాట్లాడుతూ.. ‘కల్కి 2898 ఏడీ’ విడుదల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశాం. ఆయన్నుంచి సానుకూల స్పందన లభించింది. అప్పటి నుంచి పెద్ద సినిమాలన్నింటికీ అదే కొనసాగుతోంది. ఆ విషయంలో మేం హ్యాపీ అన్నారు.