పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు ప్రకాష్ రాజ్. పవన్ ని జనాలు అంతలా ఎందుకు ఫాలో అవుతారో ఎవరీ అర్థం కాదని ఆయన తన అభిప్రాయం తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ... పవన్ కళ్యాణ్ తో మొత్తం ఐదు సినిమాలు చేశాను అన్నారు. బద్రి మూవీలో 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్' అనే డైలాగ్ చాలా ఫేమస్ అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఆ క్రెడిట్ దర్శకుడు పూరి జగన్నాథ్ కే దక్కాలి అన్నారు ఆయన.
Photo courtesy: Mana stars
27
ఇక వకీల్ సాబ్ మూవీలో నటించడం గ్రేట్ ఫీలింగ్ అని చెప్పిన ఆయన, పవన్ కళ్యాణ్ ని ప్రజలు అంతగా ఎందుకు ఫాలో అవుతారో ఎవరికీ అర్థం కాదని అన్నారు.
Photo courtesy: Mana stars
37
ఆయనలో ఎదో ప్రత్యేకత ఉంది. ఆయన తిరుగులేని స్టార్, పవర్ ప్యాక్డ్ పర్సనాలిటీ అని ప్రకాష్ రాజ్ పవన్ ని కొనియాడాడు. పవన్ తో సుస్వాగతం, బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు, జల్సా, వకీల్ సాబ్ చిత్రాలు ప్రకాష్ రాజ్ చేశారు.
Photo courtesy: Mana stars
47
కాగా కొద్దిరోజుల క్రితం పవన్ పొలిటికల్ నిర్ణయాలను ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన బీజేపీతో పొత్తుపెట్టుకోవడం తనని తీవ్రంగా నిరాశపరిచింది అన్నాడు. అధిక ఓటు బ్యాంక్ ఉన్న పవన్ కి తక్కువ ఓటు బ్యాంకు కలిగిన బీజేపీ అవసరం లేదని అన్నాడు.
Photo courtesy: Mana stars
57
పవన్ ని బీజేపీ వాళ్ళు వాడుకొని వదిలేస్తారని, బీజేపీతో పొత్తు పవన్ రాజకీయ భవిష్యత్ కి శ్రేయస్కరం కాదని, ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.
Photo courtesy: Mana stars
67
పవన్ అన్నయ్య నాగబాబు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యాడు. పవన్ నిర్ణయాల వెనుక దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల శ్రేయస్సు ఉంటాయని అన్నారు. ప్రకాష్ రాజ్ ఆరోపణలను నాగబాబు తప్పుబట్టారు.
Photo courtesy: Mana stars
77
ఆ వివాదం తరువాత పవన్, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ వకీల్ సాబ్. వకీల్ సాబ్ లో నందాజి అనే సీనియర్ లాయర్ రోల్ చేశాడు ప్రకాష్ రాజ్.