బట్టలు కాస్త పెద్దవి వేసుకో మమ్మీ.. అనసూయ కొడుకు అంత మాట అన్నాడా!

First Published Apr 16, 2021, 11:27 AM IST

హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ ఆటిట్యూడ్ గురించి అందరికీ తెలుసు. మనసుకు నచ్చినట్లు బ్రతికేసే అనసూయ, ఎవరు ఏమన్నా డోంట్ కేర్ అంటారు. అంతటితో ఆగకుండా ఎవరైనా కామెంట్ చేస్తే, ఘాటు రిప్లై ఇచ్చేస్తారు. 
 

అనసూయ డ్రెస్సింగ్ స్టైల్  అనేక మార్లు వివాదాలకు దారితీసింది. ఆమె స్కిన్ షోని విమర్శిస్తూ నెటిజెన్స్ కామెంట్స్ చేయగా, నా బట్ట గురించి మాట్లాడడానికి మీరెవరని ఓపెన్ గా ఫైర్ అయ్యారు. నా బట్టలు నా ఇష్టం అనే అనసూయ ఈ విషయంలో అస్సలు తగ్గరు.
undefined
ఆమె ప్రొఫెషన్, కెరీర్ రీత్యా అలాంటి బట్టలు వేసుకోక తప్పదు. అందుకే అనసూయ నెగిటివ్ కామెంట్స్ ని కేర్ చేయరు. అయితే ఆమె బట్టల విషయంలో ఇంటి నుండే వ్యతిరేకత వ్యక్తం అయితే మాత్రం ఆలోచించాల్సిందే.
undefined
అనసూయ కొడుకు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడడట. తాను ధరించే బట్టలు నాకు నచ్చడం లేదని అనసూయతో చెప్పాడట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో అనసూయ వెల్లడించడం జరిగింది.
undefined
అనసూయ క్రాప్ టాప్ ధరిస్తే, అనసూయ కొడుకు కొంచెం పెద్ద బట్టలు వేసుకో మమ్మీ అని అన్నాడట. దానికి అనసూయ.. ఇది నా ఛాయిస్, ఈ బట్టలలో నేను అందంగా  ఉంటాను. అలాగే నాకు కంఫర్ట్ గా ఉంటాయి. అందుకే నేను వేసుకున్నానని కొడుక్కి చెప్పిందట.

anasuya bharadwaj

అలాగే నువ్వు వేసుకున్న టీ షర్ట్ నాకు నచ్చకపోయినా వేసుకోనిచ్చాను, ఎందుకంటే అది నీ ఛాయిస్. కాబట్టి నా బట్టల విషయంలో సలహాలు ఇవ్వదని కొడుక్కి అర్థం అయ్యేలా అనసూయ చెప్పారట.
undefined
అంత చిన్న వయసులోనే అనసూయతో కొడుకు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి కామెంట్ చేశాడంటే, గొప్ప విషయమే. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ మరి.
undefined
ఇక పిల్లలను, కుటుంబాన్ని ప్రేమించే అనసూయ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా, వారితో విహారాలు ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అనసూయ కొచ్చి టూర్ కి వెళ్లినట్లు సమాచారం.
undefined
click me!