ఇలియానా ను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా? ఆమె చేసిన తప్పేంటి?

Published : Apr 11, 2026, 09:16 AM IST

హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది ఇలియానా. సౌత్ లో స్టార్ హీరోలదరి సరసన నటించి మెప్పించింది. అటువంటి ఇలియానాపై ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసింది. ఆమె చేసిన తప్పేంటి. అసలే కారణం ఏంటి? 

PREV
15
ఇండస్ట్రీ హిట్లు అందుకున్న హీరోయిన్..

ఇలియానా.. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న హీరోయిన్ ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె చేసిన హిట్ సినిమాలు మరే హీరోయన్ చేసి ఉండదు. మహేష్ బాబు జోడీగా ఇలియాన నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈసినిమా నుంచి ఆమెను అభిమానులు దేవతలా కొలిచారు. ప్యాషన్ బ్యాండ్ గా కూడా ఆమెను చూసేవారు. లేడీస్.. ఇలియానా లా మారాలని డైట్లు కూడా స్టార్ట్ చేశారు. తెలుగులో మహేష్ తో పాటు అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్, రవితేజ, తరుణ్ లాంటి హీరోలందరి సరసన నటించి మెప్పించింది బ్యూటీ.

25
ఇలియానా ను బ్యాన్ చేసిన నిర్మాతలు..

ఆ తరువాత చాలా కాలం కనిపించకుండా పోయిన ఈ బ్యూటీ.. ఇండస్ట్రీ నుంచి కొన్నాళ్లు బ్యాన్ ను ఫేస్ చేసింది. ఇలియానాను ఇండస్ట్రీన నుంచి కొంత కాలం బ్యాన్ చేయడానిక కారణం ఏంటో తెలుసా? ఆమె ఒక ప్రొడ్యూసర్ ను మోసం చేసిందన్న ఆరోపణల కారణంగా ఆమెను సినిమాలు చేయకూడదని నిషేదం విధించారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు ఒకరు వెల్లడించారు.

35
ప్రొడ్యూసర్ ను మోసం చేసిన హీరోయిన్

ఆయన మాట్లాడుతూ.. ''ఇలియానా తమిళ ప్రొడ్యూసర్ ను మోసం చేసింది.. సినిమా చేస్తానని చెప్పి ఆయన దగ్గర దాదాపు 40లక్షల వరకూ డబ్బులు తీసుకుంది. కానీ డేట్స్ ఇవ్వలేదు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దాంతో ఆ ప్రొడ్యూసర్ ఛాంబర్ లో కంప్లైట్ పెట్టాడు. దాంతో ఆమెను పిలిచించి మాట్లాడాము. ఆమెమో.. నేను డేట్స్ ఇచ్చాను కానీ ప్రొడ్యూసర్ వాడుకోలేదు అని వాదించింది. డేట్స్ ఇవ్వడం కాదు.. షూటింగ్ కు వచ్చి.. ఒక రోజు మేకప్ వేసుకున్నా.. ఆ 40లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అసలు షూటింగ్ కే రాకుండా.. నేను డేట్స్ ఇచ్చాను.. నిర్మాత వాడుకోలేదు.. ఆ అడ్వాన్స్ ఇవ్వడం కుదరదు అంటే ఎలాగా..?.. '' అని ఆయన అన్నారు.

45
4‌0 లక్షలు నష్టపోయిన నిర్మాత..

నిర్మాత మాట్లాడుతూ... '' ఇలియానా షూటింగ్స్ కు వచ్చిందా లేదా అని చెక్ చేశాము. ఆమె ఇచ్చిన డేట్స్ లో ఒక్క సారి కూడా షూటింగ్ కు రాలేదు. పైగా వేరే సినిమా కు పనిచేసింది. అందుకే పక్కాగా 40 లక్షలు కట్టాల్సిందే అని డిమాండ్ చేశాము. కట్టకపోతే బ్యాన్ చేస్తామన్నాము. బ్యాన్ వేసిన తరువాత కూడా ఒక సినిమా చేయడానికి వెళ్లింది. కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ ను కలిసి.. మీరు ఆ 40లక్షలు కట్టి.. ఆ అమ్మాయిని సినిమాలోకి తీసుకోండి. లేదా ఆమెతోనే కట్టించండి. అంతే కాదు ఈ సినిమాలో ఆమె నటించడానికి వీళ్లేదు.. ఇండస్ట్రీ ఇలియానాపై బ్యాన్ వేసిందని చెప్పాము''అని నిర్మాత అన్నారు.

55
ఫామ్ లో ఉండగానే కెరీర్ పోగొట్టుకున్న బ్యూటీ..

అలా చాలా కాలం బ్యాన్ ను ఫేస్ చేసింది ఇలియానా.. ఈ టైమ్ లోనే ఆమె చాలా అవకాశాలు పోగోట్టుకుంది. ఒక రకంగా హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయ్యిందని చెప్పాలి. గ్యాప్ తరువాత కాస్త బొద్దగా మారిన ఇలియాన.. అనుకున్నన్న అవకాశాలు మాత్రం సాధించలేకపోయింది. రవితేజ తో ఓ మూవీ చేసిన ఆమె.. సిల్వర్ స్క్రీన్ వర్కౌట్ అవ్వకపోవడంతో.. ఇండస్ట్రీని వదిలేసి కంప్లీట్ గా ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఫారెనర్ ను ప్రేమించిన ఆమె..పెళ్లి కాకుండానే సహజీవనం చేసి.. పిల్లల్ని కూడా కన్నది.. ఈమధ్యనే పెళ్లి చేసుకుని.. కుటుంబంత హ్యాపీగా ఉంటోంది.

Read more Photos on
click me!

Recommended Stories