40 సినిమాల్లో నటించాడు, ఏం ప్రయోజనం.. చిన్న చూపు చూసిన హీరో పరువు తీసిన రానా

First Published | Nov 18, 2024, 3:26 PM IST

రానా దగ్గుబాటి వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుని వెళ్లే నటుడు. దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తొలి చిత్రం నుంచే నటనలో తనదైన మార్క్ ప్రదర్శించాడు. లీడర్, కృష్ణం వందే జగద్గురం, బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలు రానాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Rana Daggubati

రానా దగ్గుబాటి వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుని వెళ్లే నటుడు. దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తొలి చిత్రం నుంచే నటనలో తనదైన మార్క్ ప్రదర్శించాడు. లీడర్, కృష్ణం వందే జగద్గురం, బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలు రానాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. బాహుబలితో రానాకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. కానీ దానిని ఉపయోగించుకోవడంలో రానా వెనుకబడ్డాడు. 

అయితే ఇటీవల రానా ఐఫా అవార్డుల వేడుకలో స్టార్ హీరోలపై సెటైర్లు వేశాడు. దీంతో అది కాస్త సోషల్ మీడియాలో రచ్చగా మారింది. తాజాగా రానా మరో హీరోపై సెటైర్ వేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే రానా ఆ హీరో పేరు చెప్పకుండా కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో రానాకి ఎందుకు మీరు సినిమాలు తక్కువ చేస్తున్నారు అనే ప్రశ్న ఎదురైంది. 


ఇదే ప్రశ్నని తనని ఓ హీరో కూడా అడిగారు అని రానా తెలిపాడు. రీసెంట్ గా ఓ హీరోని కలిశాను. నేను, ఆయన దాదాపుగా ఒకే ఏడాది కెరీర్ ప్రారంభించాం. ఆయన 40 సినిమాలు చేశాడు. నేను 12 సినిమాల్లో నటించా. ఆ హీరో ఈ విషయాన్ని గుర్తు చేశాడు. మా పక్కనే మరో వ్యక్తి కూడా ఉన్నారు. 

దీనితో నేను ఆయనకి చిన్న క్విజ్ పెట్టా. నేను నటించిన సినిమాల పేర్లు.. నాతో ఉన్న హీరో నటించిన సినిమాల పేర్లు చెప్పమని ఆ వ్యక్తిని అడిగాం. నేను నటించిన 12 సినిమాల్లో 10 సినిమాలు ఆ వ్యక్తికి తెలుసు. నా పక్కన ఉన్న హీరో నటించిన 40 సినిమాల్లో కనీసం 10 సినిమాలు కూడా ఆ వ్యక్తికి తెలియవు. నేను 10 సినిమాల్లో నటిస్తే 10 సినిమాల వరకు జనాలు గుర్తు పెట్టుకున్నారు. అది చాలు నాకు. జనాలు గుర్తు పెట్టుకోని 100 సినిమాలు చేసినా ప్రయోజనం లేదు అంటూ రానా తెలిపాడు. 

అసలు ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది రానా బయట పెట్టలేదు. మొత్తంగా తక్కువ చిత్రాల్లో నటిస్తున్నావు అని చిన్న చూపు చూసిన హీరోకి సరైన విధంగా రానా బుద్దిచెప్పాడు. అదే విధంగా ఐఫా అవార్డుల వేడుకలో వివాదం గురించి కూడా రానా స్పందించాడు. హ్యూమర్ కోసం సరదాగా చేసిన కామెంట్స్ అవి. నేను ఏంటో అందరు హీరోలకు తెలుసు. అందరూ నన్ను ప్రేమిస్తారు. పనిలేనివాళ్ళు వీడియో క్లిప్స్ వైరల్ చేసినంత మాత్రాన ఏమై అయిపోదు అంటూ రానా ఘాటుగా బదులిచ్చారు. 

Latest Videos

click me!