నిఖిల్-యష్మి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిఖిల్, పృథ్వి, యష్మి చాలా క్లోజ్. కన్నడవారు కావడంతో ఒక గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారు. సోనియా రీఎంట్రీ ఇచ్చి వారి మధ్య చిచ్చు పెట్టింది. నిఖిల్ తో యష్మి, పృథ్వి గొడవపడ్డారు.
కాగా సోనియా ఆకుల నాలుగు వారాలు హౌస్లో ఉంది. ఈ నాలుగు వారాలు ఆమె నిఖిల్, పృథ్విలతో మాత్రమే ఉంది. వారంటే ఆమెకు చాలా ఇష్టం. సోనియా ఎలిమినేషన్ కి కూడా కారణం నిఖిల్, పృథ్వినే. చిన్నోడు, పెద్దోడు అని పిలుస్తూ కలిసిపోయేది. పృథ్వి, నిఖిల్ లతో సోనియా ఆకుల బంధం బయటకు రాంగ్ గా ప్రొజెక్ట్ అయ్యింది. అందుకు ఆమె ప్రవర్తన కూడా కారణం.