జబర్దస్త్ కు అనసూయ ఎందుకు గుడ్ బై చెప్పింది.. షాకింగ్ డిటేయిల్స్.!

Published : Aug 03, 2022, 04:07 PM ISTUpdated : Aug 03, 2022, 04:17 PM IST

బుల్లితెర అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తాజాగా ‘జబర్దస్త్’కు గుడ్ బై చెప్పింది. ఇన్నాళ్లు ఆ వేదికపై అలరించిన అనసూయ వెళ్లిపోవడానికి అసలు కారణాలు షాకింగ్ గా ఉన్నాయి.    

PREV
18
జబర్దస్త్ కు అనసూయ ఎందుకు గుడ్ బై చెప్పింది.. షాకింగ్ డిటేయిల్స్.!

బుల్లితెర అందాల యాంకర్ గా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  ‘జబర్దస్త్’(Jabardasth)తోపాటు, టీవీషోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో భారీగానే ఆఫర్లను అందుుకుంటోంది. 

28

అయితే అనసూయకు ఇంతటీ క్రేజ్ ను సంపాదించి పెట్టింది మాత్రం పాపులర్ తెలుగు కామెడీ షో ‘జబర్దస్త్’ అనే చెప్పాలి.  ఈ వేదికపై పొట్టి దుస్తుల్లో, చీరకట్టులో అందాలను ఆరబోస్తూ షో రేటింగ్ ను అమాంతం పెంచేసింది. ఒకానొక దశలో అనసూయ కోసమే టీవీ ఆడియెన్స్ జబర్దస్త్ చూసే స్థాయికి వచ్చారంటే.. ఈ బ్యూటీ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. 
 

38

ఈటీవీలో మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ ఆధ్వర్యంలో ప్రసారమయ్యే కామెడీ షో ‘జబర్దస్త్’కు 9 ఏండ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించింది. షో ప్రారంభమైన 2013 నుంచి ఇప్పటి వరకు అనసూయ జర్నీ హ్యాపీగానే కొనసాగింది. అయితే ఇటీవల టెలివిజన్ ప్రేక్షకులకు షాకింగ్ డిసిజన్ ను తెలియజేసింది. తను జబర్దస్త్ మానేస్తున్నట్టు వెల్లడింది. 
 

48

ఇటీవల జబర్దస్త్ షో నుంచి కమెడియన్స్ ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్ వీడిన విషయం తెలిసిందే. తాజాగా యాంకర్ అనసూయ కూడా షోనుంచి వెళ్లిపోతున్నట్టు వెల్లడించడం షాకింగ్ ఉంది. ఈ సందర్భంగా ఓ వీడియోనూ రివీల్ చేస్తూ స్నేహపూర్వకంగానే వెళ్లిపోతున్నట్టు తెలిపింది.
 

58

కానీ బయటి సమాచారం ప్రకారం.. అనసూయ భరద్వాజ్ షోనుంచి వెళ్లిపోవడానికి గల కారణాలు షాకింగ్ ఉన్నాయి. జబర్దస్త్ షోలో పనిచేస్తే పూర్తి సమయం దానికే కేటాయించాల్సి వస్తోందని, అలాగే రెమ్యూనరేషన్ కూడా చాలా పూర్ గా ఉందని తెలుస్తోంది. పైగా సినిమాల్లోనూ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతుండటంతో షోను వీడిపోతున్నట్టు సమాచారం. 
 

68

అదేవిధంగా అనసూయకు జబర్దస్త్ షో కోసం రూ. 2 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చేవారని, ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న ‘సూపర్ సింగర్ జూనియర్’ సింగింగ్ కాంపీటిషన్ షోలో అంతకు డబుల్ రెమ్యూనరేషన్ అందుతోందని తెలుస్తోంది. ఈ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి అనసూయ వ్యాఖ్యాతగా కొనసాగుతోంది. 

78

అలాగే వెండితెరపైనే వెలుగొందుతున్న అనసూయకు సినీ ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఫీమెయిల్ లీడ్ రోల్ కంటెంట్లు హాట్ యాంకర్ ఎదుట నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితోనూ ఓ సినిమా అయ్యింది. ‘కన్యాశుల్కం’ మీదనే సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. పవన్ తో సినిమా పూర్తికాగానే అనసూయతో సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ కారణం చేత కూడా అనసూయ జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిందనే టాక్ ఉంది.
 

88

అనసూయకు ప్రస్తుత సమయం బుల్లితెర నటి నుంచి వెండితెర నటిగా మారేదిగా కనిపిస్తోంది. కాలం కలిసి వస్తే మున్ముందు బిగ్ స్క్రీన్ పైనే మెరియనుంది. ఇప్పటికే ఈ బ్యూటీ ‘పుష్ఫ : ది రూల్’, ‘రంగ మార్తాండ’, ‘వాంటెడ్ పాండుగాడ్’ లో నటిస్తోంది.  ఆయా  చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తోనూ ఆకట్టుకోనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories