Rajamouli: టాలీవుడ్ లో ఈ పరిస్థితికి కారణం రాజమౌళి, శత్రువు అతడే.. ఆర్జీవీ నిందలు, నిజమే అంటున్న నెటిజన్లు

First Published Aug 3, 2022, 3:07 PM IST

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా ఒక లాజిక్ తో మాట్లాడతారు అని ఆయన అభిమానులు అంటుంటారు. ఇతరులు మాత్రం వర్మది అంతా పిచ్చి వాడుగు అంటూ కొట్టి పారేస్తుంటారు.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా ఒక లాజిక్ తో మాట్లాడతారు అని ఆయన అభిమానులు అంటుంటారు. ఇతరులు మాత్రం వర్మది అంతా పిచ్చి వాడుగు అంటూ కొట్టి పారేస్తుంటారు. ఏది ఏమైనా తన కామెంట్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడం వర్మ స్టైల్. 

ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కోంటున్న థియేటర్స్ సమస్యలు, ఓటిటి ప్రభావం, నిర్మాతల సమస్యలపై వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. థియేటర్స్ కి జనాలు రాకపోవడం.. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడంపై టాలీవుడ్ లో ఎవరి లెక్కలు వాళ్ళకి ఉన్నాయి. ఓటిటి ప్రభావం పడిందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని అంటున్నారు. 

దీనిపై వర్మ వాదన భిన్నంగా ఉంది. టాలీవడ్ లో ఈ పరిస్థితికి కారణం ఓటిటి, థియేటర్స్ సమస్య ఇవేమి కాదు. ఈ పరిస్థితి అంతటికి కారణం రాజమౌళి ఒక్కడే. అతడి వల్లే ఇందంతా.. టాలీవుడ్ కి రాజమౌళి శత్రువు అంటూ రాంగోపాల్ వర్మ నిందలు వేసారు. అందుకు గల కారణాలు కూడా వర్మ వివరించారు. 

సినిమా బాగా తీస్తే 2000 కోట్లు వస్తాయని రాజమౌళి నిరూపించారు. అలాగే సినిమా క్వాలిటీ పరంగా రాజమౌళి కొత్త స్టాండర్డ్స్ సెట్ చేశారు. దీని ముందు ఇతర చిత్రాలు నిలబడలేకపోతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ అలాంటి చిత్రాలే. 

NTR - Rajamouli

రాజమౌళి సినిమాల ముందు మిగిలిన సినిమాల పరిస్థితి రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్ట బుద్ది అయింది అనే సామెతలాగా అయిపోయింది అని వర్మ అన్నారు. దీనితో నిర్మాతలు కూడా రాజమౌళి స్టాండర్డ్స్ అందుకునేందుకు డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఫలితంగా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. నిర్మాత అంత డబ్బు పెట్టలేను అని చెప్పినా దర్శకులు ఒప్పుకోవడం లేదు. 

rajamouli

అంతా అనుకుంటున్నట్లు ఓటిటి అసలు సమస్యే కాదు. రాజమౌళి తర్వాత మరో సమస్య యూట్యూబ్, సోషల్ మీడియా అని వర్మ అన్నారు. థియేటర్ కంటే మంచి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్, సోషల్ మీడియాలో లభిస్తోంది. ఇక 2 గంటలు టైం వేస్ట్ చేసుకుని థియేటర్స్ కి ఎవరు వెళతారు అని వర్మ ప్రశ్నించారు. 

మరి వర్మ ఈ తరహాలో తనపై నిందలు వేస్తే జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి. రాజమోళి సినిమా తర్వాత ఆ హీరోలు చేసే మూవీస్ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీని గురించి ప్రశ్నించినప్పుడే అసలు నాకేమైనా సంబంధం ఉందా అని రాజమౌళి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు వర్మ చేస్తున్న కామెంట్స్ కూడా అలాంటివే. కానీ రాజమౌళి వర్మ ఇచ్చిన వివరణ సరైనది అని.. రాజమౌళి సెట్ చేసిన అంచనాలు అందుకోలేక ఇతర చిత్రాలు డీలా పడుతున్నాయి నెటిజన్లు వర్మకి మద్దతు తెలుపుతున్నారు. 

click me!