‘ఆర్ ఎక్స్100’తో పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) టాలీవుడ్ లో సెన్సేషన్ హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందం, నటనతోనూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
మళ్లీ ఆసినిమా దర్శకుడు అజయ్ భూపతితోనే పాయల్ సినిమా చేస్తుండటం విశేషం. ‘మంగళవారం’ అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకూ రానుంది. ప్రస్తుతం ఈసినిమాపైనే పాయల్ ఆశలు పెట్టుకుంది. ఈ క్రేజీ కాంబినేషన్ పైనా అంచనాలు ఉన్నాయి.
ఈసారి ఎలాగైనా పాయల్ హిట్ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే Mangalavaaram నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
నవంబర్ 17న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. దీంతో తన సినిమాపై ఆసక్తినిపెంచేందుకు పాయల్ కృషి చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది.
ఈ క్రమంలో నయా లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు బ్యూటీపుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా పాయల్ చీరకట్టులో దర్శనమిచ్చింది. అదిరిపోయే లుక్ లో ఖతర్నాక్ ఫోజులతో కట్టిపడేస్తోంది.
తాజాగా పాయల్ చీరకట్టి అందాల ప్రదర్శన చేసింది. వైట్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో దర్శనమిచ్చింది. చీరలో మంత్రముగ్ధులను చేసింది. స్లీవ్ లెస్ డీప్ నెక్ బ్లౌజ్ లో ఈ బ్యూటీ గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.