హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నిహారిక మాజీ భర్త, మెగా డాటర్ కు షాక్ ఇచ్చిన చైతన్య ..?

First Published | Nov 7, 2024, 6:00 PM IST

మెగా డాటర్ నిహారికకు ఆమె మాజీ భర్త జోన్నలగడ్డ చైతన్య షాక్ ఇచ్చాడు. త్వరలో ఓ హీరోయిన్ను ఆయన పెళ్ళాడబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరామె..? 
 

మెగా డాటర్ నిహారికకు షాక్ ఇచ్చాడు  ఆమె మాజీ భర్త జోన్నలగడ్డ చైతన్య. ఈమధ్యే నిహారిక తో విడాకులు తీసుకున్న చైతన్య.. తాజాగా రెండో పెళ్ళికి సిద్దం అయ్యాడు. అంతే కాదు మరో షాకింగ్ విషయం ఏంటంటే.. చైతన్య ఓ హీరోయిన్ ను పెళ్ళాడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్..?  ఈవార్తలో నిజం ఎంత..?

Also Read: మెగాస్టార్ తాగిన ఎంగిలి కప్పును దాచుకన్న స్టార్ కమెడియన్, లక్ష ఇచ్చినా అది ఎవరికీ ఇవ్వడట.
 


మెగా ఫ్యామిలీలో వరుసగా రెండు విడాకులు చూశాం. ఇద్దరు మెగా ఫ్యామిలీ డాటర్లు.. తమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు. అందులో మెగా బ్రదర్ నాగబాబు గారాల కూతురు నిహారిక కూడా ఉంది. పెళ్లై ముచ్చటగా మూడేళ్లు కూడా గడవకముందే మన్పర్ధలతో విడాకులు తీసుకున్నారు నిహారిక, చైతన్య.

ఈ విషయంలో నిహారిక వైపే ఎక్కువగా తప్పులు చూపించారు నెటిజన్లు. పెళ్ళికి ముందు ఏటువంటి ఇబ్బందులు కాని.. నిహారిక విషయంలో ఏ తప్పులు కాని కనిపించలేదు.

కాని పెళ్ళి తరువాత నిహారిక వెళ్లిన పార్టీలో డ్రగ్స్ దొరకడం.. జిమ్ ట్రైనర్ తో నిహారిక ఇబ్బందికర వీడియోలు పోస్ట్ చేయడంతో.. వెంటనే ఆమెపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఐపీఎస్  ఇంటికి కోడలిగా వెళ్ళిన నిహారిక ఇలా చేయడంపై చాలా రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. 

Also Read: ఈ సినిమా చేయను, వెళ్ళిపోతాను.. జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ తో గొడవపెట్టుకున్న మూవీ ఏదో తెలుసా..?


నిహారిక కూడా తన విడాకుల గురించి కొన్ని పోస్ట్ పెడుతుండగా.. నిహారిక పెట్టే కొన్ని పోస్టులకు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు చైతన్య. అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం  వీరిద్దరు కలుస్తారని అనుకున్నారు.. కానీ చూడగా చూడగా ఇక ఆ ఛాన్స్ లేదని తెలుస్తుంది.  నిహారిక తో విడిపోయిన ఇంత కాలానికి  చైతన్య ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 

ఇద్దరికి పెద్ద వయస్సు అయిపోలేదు. యంగ్ ఏజ్ లోనే పెళ్ళి చేసుకుని వెంటనే విడాకులు తీసుకున్నారు. దాంతో నిహారిక పెళ్ళి గురించి ఆమధ్య వరకూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె కూడా నా వయసేమి అయిపోలేదు.. మంచి వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటా అని కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఈలోపే చైతన్య పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

జొన్నలగడ్డ చైతన్య పెళ్ళి కి రెడీ అవుతున్నాడట. అయితే ఆ పెళ్ళి కూతురు ఎవరో కాదు.. నిహారిక ఫ్రెండ్ అని తెలుస్తోంది. అంతే కాదు ఆహె ఓ యంగ్ హీరోయిన్ అని కూడా టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని.. ప్రస్తుతం చైతన్య పెళ్ళి వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది.  అయితే ఈ వార్తను మాత్రం మెగా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. 

మెగా బ్రదర్ నాగ బాబు కూతురు మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయిపోయింది. పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ నిర్మాతగానే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది.

అయితే ఈమె సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. అయితే ఈ బ్యూటీ కొన్ని సార్లు పెట్టే పోస్టులకు చైతన్య రియాక్ట్ అయ్యేవాడు. తప్ప మరెక్కడా ఆయన కనిపించలేదు.

నిహారికతో విడాకులు.. ఆమెతో మన్పర్ధల వల్ల.. డిస్ట్రబ్ అయిన చైతన్య.. కొన్నాల్లు ఆశ్రమంలో ఉన్నట్టు గతంలో అతను పెట్టిన పోస్ట్ వల్ల తెలుస్తోంది. మరి ఈ ఇబ్బందుల నుంచి కోలుకుని పెళ్ళికి సిద్దం అయినట్టు సమాచారం. ఇందులో నిజం ఎంత ఉందో చూడాలి. 
 

Latest Videos

click me!