Mahesh Babu: మహేష్ బాబు సినిమాల్లో ఆ స్టార్ కమెడియన్ ఎందుకు కనిపించడో తెలుసా.?

Published : Mar 30, 2026, 09:34 PM IST

Mahesh Babu: మహేష్ బాబు, సునీల్ మధ్య విభేదాలకు 'ఖలేజా' సీన్ లీకేజీ కారణమా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆసక్తికరమైన రూమర్, 'గుంటూరు కారం' విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.. 

PREV
15
కచ్చితంగా నవ్వులు పూయాల్సిందే

టాలీవుడ్‌లో ఒకప్పుడు మహేష్ బాబు - సునీల్ కాంబినేషన్ అంటే కచ్చితంగా నవ్వులు పూయాల్సిందే. కానీ గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి నటించడం లేదు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనే దానిపై సోషల్ మీడియాలో ఒక బలమైన రూమర్ నడుస్తోంది.

25
ఖలేజా వర్సెస్ మగధీర

మహేష్ బాబు హీరోగా వచ్చిన 'ఖలేజా' సినిమా షూటింగ్ 2008లోనే ప్రారంభమైంది. అయితే కొన్ని కారణాల వల్ల అది 2010లో విడుదలైంది. ఈ క్రమంలో 'ఖలేజా'లో రావు రమేష్ పాత్ర హీరోను దేవుడిగా ఎలివేట్ చేసే ఒక కీలక సీన్ ఉంటుంది. ఇదే తరహా సీన్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర'లో కూడా ఉంటుంది.

35
లీక్ చేశారనే ఆరోపణ

ఖలేజా షూటింగ్ సమయంలో ఉన్న సునీల్, ఆ సీన్ గురించి దర్శకుడు రాజమౌళి కు ముందే లీక్ చేశారని, అందుకే మగధీరలో అలాంటి సీన్ వచ్చిందని మహేష్ బాబు భావించారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి మహేష్ బాబు సునీల్‌ను తన సినిమాలకు దూరం పెట్టారని సమాచారం.

45
గుంటూరు కారం వరకు..

చాలా కాలం తర్వాత 'గుంటూరు కారం' సినిమాలో సునీల్ నటించినప్పటికీ, ఆ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం గమనార్హం. ఆయన పాత్రను కేవలం నామమాత్రంగానే ఉంచారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

55
సోషల్ మీడియాలో ప్రచారం

ఇది కేవలం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న రూమర్ మాత్రమే. దీనిపై ఇటు మహేష్ బాబు గానీ, అటు సునీల్ గానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, వీరిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ మంచి కామెడీ సీన్లు చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories