Silk Smitha: బోల్డ్ క్యారెక్టర్స్ చేసే సిల్క్ స్మితతో పట్టుచీర కట్టించిన నిర్మాత ఎవరో తెలుసా?

Published : Aug 07, 2026, 07:08 AM IST

Silk Smitha: స్టార్ హీరోయిన్లను మించి ఇమేజ్ తో దూసుకుపోయింది సిల్క్ స్మిత. కానీ ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవ్వడంతో సిల్క్ స్మిత పేరు మరుగున పడిపోయింది. బోల్డ్ క్యరెక్టర్స్ మాత్రమే చేసిన ఈనటితో పట్టుచీర కట్టించింది ఎవరో తెలుసా?

PREV
15
ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన తార

సిల్క్ స్మిత.. ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన నటి. వ్యాంపు పాత్రలతో పాపులర్‌, ఐటెమ్ సాంగ్‌లతో విశేష గుర్తింపు తెచ్చుకుంది సిల్మ్ స్మిత. తనకంటూ ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఆమె నటించిన పాత్రలకు ఆ ఇమేజ్‌ని యాడ్‌ చేసింది. ఇండియన్‌ సినిమాల్లోనే ఓ అరుదైన నటిగా నిలిచింది సిల్క్ స్మిత. కేవలం 18ఏళ్ల సినిమా జీవితంలోనే ఆమె 450కిపైగా సినిమాలు చేసిందంటే ఆమె ఏ రేంజ్‌లో చిత్ర పరిశ్రమని ఊపేసిందో అర్థం చేసుకోవచ్చు.

25
సిల్క్ స్మితలో టాలెంట్ ను బయటకు తీసిన నిర్మాత..

సిల్క్ స్మిత అంటే సాధారణంగా గ్లామరస్ పాత్రలే గుర్తొస్తాయి. కానీ ఆమెలోని గొప్ప నటీమణిని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రతిభను తగిన విధంగా ఉపయోగించుకున్న కొద్దిమంది దర్శకులు, నిర్మాతలలో ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి ఒకరు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మురారి సిల్క్ స్మితతో తనకు ఉన్న అనుబంధాన్ని, సినిమా నిర్మాణంలో ఆమెతో పనిచేసిన అనుభవాలను, ఆమెలో అద్భుతమైన నటి గురించి ఎన్నో విషయాలను శేర్ చేసుకున్నారు.

35
సిల్క్ స్మిత పాత్రలో ప్రత్యేకత

సిల్క్ స్మిత మంచి కళాకారిణి అని, కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని మురారి గుర్తుచేసుకున్నారు. తను నిర్మించిన ఒక సినిమాలో సిల్క్ స్మిత చేత సాంప్రదాయక పట్టుచీర కట్టించి, జాకెట్ వేయించి పూర్తిస్థాయి క్యారెక్టర్ రోల్ చేయించానని తెలిపారు. ఎప్పుడూ బోల్డ్.. గ్లామరస్ పాత్రల్లోనే కనిపించే సిల్క్ స్మిత, ఆ సినిమాలో త్యాగనిరతితో కూడిన బాధాకరమైన (సాక్రిఫైసింగ్ & పాథటిక్) క్యారెక్టర్ చేయాల్సి వచ్చేసరికి ఎంతగానో ఆశ్చర్యపోయిందని ఆయన అన్నారు.

45
వ్యతిరేకించిన శోభన్ బాబు.. దాసరి

అదే సినిమాలో ఒక పాట చిత్రీకరణ సమయంలో కథా సన్నివేశానికి తగ్గట్టుగా సిల్క్ స్మిత కోసం పద్దతైన పాత్ర చేసే ప్రయత్నం చేసినప్పుడు, శోభన్ బాబు - నారాయణరావు వ్యతిరేకించారట. ఆ తరహా సన్నివేశాలపై కొన్ని సందేహాలు వ్యక్తం చేశారట. కానీ మురారి మాత్రం ఆ కథా పరిస్థితికి తగ్గట్టుగా తాను అన్నున్నది ఇది అని వారికి నచ్చచెప్పి సిల్క్ చేత ఆ పాత్ర చేయించినట్టు మురారి అన్నారు.

55
సిల్క్ స్మిత కెరీర్ లో చాలా స్పెషల్..

ఒక రచయిత లేదా నిర్మాత తన ఊహల్లో అనుకున్న పాత్రను ఎలా రూపొందిస్తాడో మురారి తన మాటల్లో వివరించారు. కాళిదాసు శకుంతల పాత్రను రాసినట్టుగా.. . కథలో పాత్రల స్వభావం, సందర్భం అనేవి సృష్టికర్త భావనకు అనుగుణంగానే సాగుతాయని ఆయన చెప్పారు. గ్లామర్ ఇమేజ్‌కే పరిమితమైన సిల్క్ లాంటి నటిలోని నిజమైన నటనా నైపుణ్యాన్ని గుర్తించి, ఆమెకు భిన్నమైన పట్టుచీర కట్టించి ప్రత్యేకమైన క్యారెక్టర్ పాత్రను కేటాయించడం సిల్క్ స్మిత సినీ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories