నోరా ఫతేహీ అంటే చాలామంది గుర్తుపట్టరేమో కాని.. రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బాహుబళి సినిమాలో మనోహరి పాటకు డాన్స్ చేసిన డాన్సర్లలొ ఒకరు అంటే మాత్రం వెంటనే గుర్తుకువస్తుంది. ఈ పాటతో నోరా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. నటిగా మాత్రమే కాకుండా.. మల్టీ టాలెంట్ లేడీగా పేరు తెచ్చుకుంది నోరా. మోడల్, నిర్మాత, గాయని, డాన్సర్ గా ఫేమస్ అయ్యింది బ్యూటీ.