Srikanth Nagothi: ఎవరీ శ్రీకాంత్ నాగోతి? కలర్స్ స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? రెండో పెళ్లికి కారణం ఏంటి?

Published : Jul 09, 2026, 11:13 AM IST

Srikanth Nagothi: తెలుగు నటి కలర్స్ స్వాతి మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని పెళ్లాడింది. ఇంతకీ శ్రీకాంత్ నాగోతి ఎవరు? ఏ సినిమాలు చేశాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? 

PREV
15
యంగ్ డైరెక్టర్ ను పెళ్లాడిన కలర్స్ స్వాతి..

కలర్స్ స్వాతిగా సుపరిచితురాలైన నటి స్వాతి రెడ్డి, దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని రెండో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలకు తెరలేపుతూ.. పెళ్లి బంధంతో ఇద్దరు ఒక్కటయ్యారు.పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. కలర్స్ స్వాతీ తన సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ నాగోతి ఎవరు, ఆయన నేపథ్యం ఏంటనే విషయాలపై నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

25
ఎవరీ శ్రీకాంత్ నాగోతి?

శ్రీకాంత్ నాగోతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఒక యువ ప్రతిభావంతుడైన దర్శకుడు. ఆయన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. సినిమాపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టి, మెల్లగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. వైవిధ్యమైన కథలతో, సరికొత్త కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నేర్పరి. నవీన్ చంద్ర, సలోనీ లూత్రా ప్రధాన పాత్రల్లో నటించిన "భానుమతి అండ్ రామకృష్ణ" (2020) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీకాంత్.. ఆతర్వాత "మంత్ ఆఫ్ మధు" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

35
రెండు సినిమాలలో శ్రీకాంత్ మార్క్..

శ్రీకాంత్‌ రెండు సినిమాల్లో నవీన్ చంద్రనే హీరోగా నటించడం విశేషం. భానుమతి అండ్ రామకృష్ణ అర్బన్ రొమాంటిక్ డ్రామా ఆహా (Aha) ఓటీటీ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆధునిక సంబంధాలు, పరిణతి చెందిన ప్రేమకథను డీల్ చేసిన విధానానికి శ్రీకాంత్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఆయన స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో (Month of Madhu - 2023) అనే సినిమాను రూపొందించారు. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం వివాహిక బంధాలలోని సంక్లిష్టతలను ఎమోషనల్‌గా చూపించింది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

45
స్వాతితో పరిచయం, ప్రేమ

"మంత్ ఆఫ్ మధు" సినిమా చిత్రీకరణ సమయంలోనే శ్రీకాంత్ నాగోతి, స్వాతి రెడ్డిల మధ్య పరిచయం ఏర్పడింది. సినిమా కథా చర్చలు, షూటింగ్ సమయంలో ఒకరి ఆలోచనలు మరొకరికి నచ్చడంతో వీరి మధ్య స్నేహం బలపడింది. స్వాతి మొదటి వివాహ కేరళకు చెందిన పైలెట్ వికాస్ తో జరగగా.. ఆ బంధం విడాకులతో ముగిసింది. ఆతర్వాత ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకుల్లో శ్రీకాంత్ ఆమెకు మంచి స్నేహితుడిగా, చేదోడుగా నిలిచారని అంటుంటారు. పరస్పర అవగాహన, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం వీరిని ప్రేమ వైపు నడిపించాయి. ఇరు కుటుంబాల సమ్మతితో వీరు తమ బంధాన్ని వివాహంగా మార్చుకున్నారు.

55
ఇండస్ట్రీలో మంచి పేరు..

సినీ పరిశ్రమలో శ్రీకాంత్ నాగోతికి మంచి పేరు ఉంది. సున్నితమైన ఎమెషన్స్ ను వెండితెరపై పండించగల దర్శకుడిగా చూస్తారు. స్వాతితో ఆయన కొత్త జీవితం సంతోషంగా సాగాలని ఇటు అభిమానులు, అటు సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. గతంలో పెళ్లి తరువాత సిల్వర్ స్క్రీన్ కు దూరం అయ్యింది స్వాతి. మరి ఈసారి తన కెరీర్ ను కంటీన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories