భారీ ధరకు ‘ది వారియర్’ ఓటీటీ రైట్స్.. ఎవరు దక్కించుకున్నారంటే?

Published : Jul 14, 2022, 12:02 PM ISTUpdated : Jul 14, 2022, 12:05 PM IST

ఉస్తాద్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన ‘ది వారియర్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు థియేట్రికల్ రిలీజ్ గ్రాండ్ గా జరిగింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. 

PREV
16
భారీ ధరకు ‘ది వారియర్’ ఓటీటీ రైట్స్.. ఎవరు దక్కించుకున్నారంటే?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ కృతి శెట్టి నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో రూపొందింది.  అయితే ఇస్మార్ట్ శంకర్ తో రూటు మార్చిన  రామ్ పోతినేని.. వరుసగా మాస్ కంటెంట్లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
 

26

తాజాగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా డబుల్ ఎనర్జీని చూపుతూ The Warriorrతో ఈరోజు (జూలై14)న థియేటర్లలో అడుగుపెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా 1,280 థియేటర్లలో మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రామ్ కేరీర్ లోనే ఇన్ని థియేటర్లలో సినిమా ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం. బిగ్ స్క్రీన్ పై రామ్ చెడుగుడు అడుకున్నాడని ఆడియెన్స్ నుంచి హిట్ టాక్ వినిపిస్తోంది. 
 

36

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నట్టు తెలుస్తోంది. చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని.. ప్రస్తుతం మాస్ హీరోల జాబితాలోకి ఎక్కారు.  క్లాసైనా.. మాస్ అయినా కుమ్మేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ సినిమాలకు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ‘ది వారియర్’ ఓటీటీ రైట్స్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది.

46

తాజా సమాచారం ప్రకారం.. ది వారియర్ మూవీని ఓటీటీ రైట్స్ ను ‘స్టార్ నెట్ వర్క్’ మరియు ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. టెలివిజన్ రైట్స్ ను స్టార్ నెట్ వర్క్ దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. అయితే భారీ ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ వెర్షన్ కలిపి రూ.15 కోట్లకు పైగానే ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
 

56

సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం.. మరోవైపు గట్టిగా పోటీనిచ్చే సినిమా లేకపోవడంతో ‘ది వారియర్’ బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుకోవడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మంచి నెంబరే జరిగినట్టు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ షేర్ బ్రేక్ ఈవెన్ ను రూ.44 కోట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. 
 

66

తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో వచ్చిన చిత్రమే ‘ది వారియర్’. హీరోహీరోయిన్లుగా రామ్ పోతినేని, కృతి శెట్టి నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మాత చిత్తూరి శ్రీనివాస నిర్మించారు. ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా పలు కీలక పాత్రలను పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే చార్ట్ బాస్టర్ ను అందించారు.   

click me!

Recommended Stories