ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కంప్లీట్ గా డైట్ ను ఫాలో అవుతుంటారు.. ప్రోటీన్, ఫైబర్ అంటూ.. క్యాలరీలు కౌంట్ చేస్తూ.. తింటుంటారు. కానీ రోజు మొత్తంలో ఒక్క సారి మాత్రమే భోజనం చేసి.. రోజంతా ఏమీ తినకుండా ఉండే హీరో ఎవరో తెలుసా?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్.. ఆతరువాత కాలంలో అల్లరి నరేష్ కు మాత్రమే ఆ ఇమేజ్ వచ్చింది. నరేష్ టాలీవుడ్ కు దొరికిన అరుదైన కామెడీ హీరో అని చెప్పవచ్చు. 10 ఏళ్లకు పైగా తన సినిమాలతో నవ్వించిన నరేష్.. తరువాత కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కొంత కాలానికి ఆయన కామెడీ ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. సినిమా అవకాశాలు కూడా లేని రోజుల్లో.. రూట్ మార్చి సీరియస్ పాత్రలు చేయడం స్టార్ట్ చేశాడు, కామెడీ పాత్రలు వదిలి సీరియస్ సబ్జెక్ట్స్ ను తీసుకుని హిట్లు కొడుతున్నాడు అల్లరి నరేష్. చాలా తక్కువ టైమ్ లోనే నరేష్ 50 సినిమాలు కంప్లీట్ చేశాడు.
25
హీరో అంటే డైట్ పక్కా..
సాధారణంగా సినీ నటులు తమ ఫిట్‌నెస్, గ్లామర్, ఆరోగ్యం కోసం కఠినమైన డైట్ ప్లాన్‌లు పాటించడం చూస్తుంటాం. మరికొంత మంది మాత్రం డైట్ పక్కన పట్టి కడుపునిండా తిని.. కసరత్తులు చేస్తుంటారు. అయితే, అల్లరి నరేష్ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం అందరికంటే చాలా భిన్నంగా, ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు, తన ఆహారపు అలవాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
35
రోజుకు ఒక్క పూటే భోజనం (One Meal A Day)
అల్లరి నరేష్ వెల్లడించిన షాకింగ్ విషయం ఏమిటంటే ఆయన రోజుకు ఒక్కసారి మాత్రమే (One Meal A Day) భోజనం చేస్తారు. రోజంతా మిగిలిన సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోకపోవడం ఆయన అలవాటు. ఒకవేళ మధ్యాహ్నం లంచ్ చేస్తే, ఇక రాత్రికి డిన్నర్ ఉండదు. లేదా ఒకవేళ రాత్రికి డిన్నర్ తింటే, మధ్యాహ్నం లంచ్ ఉండదు. ఈ విధంగా రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోవడం వల్ల తనకు శరీరానికి కావాల్సిన శక్తి సరిపోతుందని నరేష్ అభిప్రాయం.
సాధారణంగా చాలామందికి భోజనానికి, భోజనానికి మధ్యలో ఏదో ఒక స్నాక్ లేదా పండ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ నరేష్ విషయంలో మాత్రం ఇలాంటిదేమి ఉండదు. రోజు మొత్తంలో ఒక్క సారి భోజనం చేయడం తప్పించి.. మధ్య గ్యాప్‌లో ఏమీ తినడు. చివరికి షూటింగ్ గ్యాప్ లో కొబ్బరినీళ్లు, హెల్తీ జ్యూస్‌లు లాంటివి కూడా ఆయన తీసుకోరు. అంతే కాదు ఇంట్లో సాధారణంగా స్నాక్స్, మురుకులు, కారప్పూస, స్వీట్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ తినుబండారాల జోలికి అస్సలు వెళ్లరట నరేష్.
55
ఫుడ్ టెంప్టేషన్ లేదు..
నరేష్ ఇలా తినకపోవడానికి కారణం.. అసలు ఆయనకు ఫుడ్ టెంప్టేషన్ ఉండదు. చాలామందికి నచ్చిన వంటకాలు చూసినప్పుడు లేదా ఇష్టమైన పదార్థాలు ఎదురుగా ఉన్నప్పుడు తినాలనే కోరిక పుడుతుంది. కొంత మంది ఆపుకోలేక తింటుంటారు కూడా. కానీ అల్లరి నరేష్‌కు అలాంటి ఫుడ్ టెంప్టేషన్ (ఆహారపు ఆకర్షణ) అస్సలు ఉండదట. ఆహారాన్ని చూసి టెంప్ట్ అవ్వడం తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని ఆయనే స్వయంగా చెప్పారు.తినే ఆ ఒక్క పూట భోజనం మాత్రం చాలా హెవీగా తింటానని నరేష్ తెలిపారు. ఆ ఒక్క మీల్‌లో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, రైస్, రొట్టెలు, కూరలు, గుడ్లు, పండ్లు ఉండేలా చూసుకుంటారు.