మహేష్ బాబు - నందమూరి బ్రహ్మణి కాంబోలో మిస్ అయిన సినిమా..?

First Published | Jan 5, 2025, 12:12 PM IST

నటసింహం నందమూరి బాలయ్య పెద్ద కూతురు.. నారా వారి కోడలు బ్రహ్మణీ హీరోయిన్ గా నటించబోయి మిస్ అయ్యిందని మీకుతెలుసా..? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ గా బ్రహ్మణి మిస్ అయిన సినిమా ఏంటంటే..? 
 

Nara Brahmani

నందమూరి వంశంలో పెద్దాయన ఎన్టీఆర్ తరువాత వరుసగా బాలయ్య , హరికృష్ణ,  కల్యాణ్ రామ్, ఎన్టీఆర్, తారకరత్న, మోక్షజ్ఞ ఇలా  హీరోలు వారసులగా వచ్చారు కాని..నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోయిన్లు వచ్చింది లేదు. హీరోయిన్లు గా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చే ఛాన్స్ ఉన్నవారు కూడా ఎవరు లేరు. కాని బాలయ్య బాబు కూతుర్లు ఇద్దరు మాత్రం హీరోయిన్లుగా మారగలిగే గ్లామర్ ఉన్నా కాని.. వారు ఇండస్ట్రీకి రాలేదు.  
 

Nara Brahmani and Tejashwini

బాలయ్య కూడా సినిమాల వైపు వాళ్లను ఎంకరేజ్ చేయలేదు అనేచెప్పాలి. అయితే బాలయ్య చిన్న కూతురు తేజస్వీ మాత్రం ప్రస్తుతం నిర్మతగా కెరీర్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని ఆమె నిర్మిస్తున్నట్టు సమాచారం. అయితే తేజస్వీ కాని, బ్రహ్మణికి కాని సినిమా అవకాశాలు వచ్చాయట గతంలో. కాని వారు సినిమాలు చేయలేదని తెలుస్తోంది. 
 


ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. బ్రహ్మణి - మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా మిస్ అయ్యిందని సమాచారం. ఇంతకీ వీరి కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా.. అతడు. అవును  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన అతడు సినిమాలో బాలయ్య బాబు కూతురు బ్రాహ్మనీని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచన వచ్చిందట దర్శకుడు అయిన త్రివిక్రమ్ కు.
 

 దాంతో ఈ ప్రపోజల్ ను  ఆ సినిమా ప్రొడ్యూసర్.. సీనియర్ యాక్టర్  మురళీమోహన్  బాలయ్య బాబు ను సంప్రదించారట… దానికి బాలయ్య బాబు కూడా ఓకే అన్నప్పటికి బ్రాహ్మిని మాత్రం నటించడానికి ఒప్పుకోలేదట. తనకు నటించే ఉద్దేశం  లేదని చెప్పడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఆ ప్లేస్ లో త్రిష ను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.
 

లేకపోతే మహేష్ బాబు నందమూరి బ్రాహ్మిని కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సినిమా అయితే వచ్చేది. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు .. వారు అఫీషియల్ గా చెప్పలేదు కాని టాలీవుడ్ లో టాక్ మాత్రం నడిచింది. 

 ప్రస్తుతం బ్రహ్మణి.. నారావారి కోడలుగా.. మంత్రి లోకేష్ భార్యగా.. సీఎం చంద్రబాబు కోడలిగా.. హెరిటేజ్ కంపెనీకి ఓనర్ గా.. బిజినెస్ ఉమెన్ గా ఎదుగుతూ వస్తున్నారు. ప్రతీ చోట మంచి పేరు తెచ్చుకుంటున్నారు బ్రాహ్మణి. 

Latest Videos

click me!