ఆ తర్వాత జివిజి రాజు నన్ను పిలిపించి నైజాం ఏరియాలో తొలిప్రేమ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు. నేను నైజాం ఏరియా హక్కులు 80 లక్షలకు కొనుక్కున్నా. మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ఏంటంటే ఆ 80 లక్షల మొత్తం షేర్ ఒక్క సంధ్య థియేటర్ లోనే తొలిప్రేమ చిత్రం వసూలు చేసింది. మిగిలినదంతా లాభాలే. పెట్టుబడి మొత్తం ఒక్క థియేటర్ ద్వారానే రావడం అనేది అరుదైన రికార్డ్ అని గిరి అన్నారు. మెగా హీరోల చాలా చిత్రాలు సంధ్య థియేటర్ లో అద్భుతంగా ఆడాయి. తొలిప్రేమ, ఘరానా మొగుడు, ఖుషి చిత్రాలు సంధ్య థియేటర్ లో రికార్డులు సృష్టించాయి అని గిరి తెలిపారు. ఆ విధంగా సంధ్య థియేటర్ మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్ గా మారింది.