ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా సంపూర్ణేష్ బాబు, ఇప్పుడేం చేస్తున్నారు..? ఎక్కడున్నారు..?

కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు గుర్తున్నాడా..? ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారా..? లేదా..? ఉంటే ఏం సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఇండస్ట్రీని వదిలేశారు అని వస్తున్న వార్తల్లో నిజం ఎంత..?
 

Sampoornesh babu

ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు రావాలంటే ఏదో ఒక డిఫరెంట్ టాలెంట్ ఉండాలి.. దానికి అదృష్టం తోడు అవ్వాలి. కోటా శ్రీనివాసరావు అన్నట్టు.. కొండంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లుగా మారుతారు అని..ఈ కోవలోకే వస్తాడు కమెడీ హీరో సంపూర్ణేష్ బాబు. 

నాగార్జున గారు సోనియా అంటే ఎందుకంత ప్రేమ..

Sampoornesh babu

టాలీవుడ్ లో హీరోలు.. కామెడీ హీరోలు.. జూనియర్ హీరోలు చాలామంది ఉన్నారు. కాని అందరికంటే కొత్త దనం చూపించాడు కాబట్టే సంపూర్ణేష్ బాబు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఎక్కడా పల్లెటూరిలో స్వర్ణకార వృత్తి చేసుకునే వ్యక్తిని ఇండస్ట్రీలో స్టార్న్ చేసింది. ఆ టాలెంట్.

జూనియర్ ఎన్టీఆర్ ‌- పవన్ మల్టీ స్టారర్  


Sampoornesh babu

ఇక దర్శకుడు సాయి రాజేష్ నిర్మించిన హ‌ృదయ కాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబు స్టార్ అయ్యాడు. ఆతరువాత కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. సంపూ. ఇక సమాజ సేవలో కూడా తన వంతు పాలు పంచుకునే  ఈ మంచి హీరో... వరదలు లాంటి విపత్తులు వస్తే.. తన వంతుగా అంతో ఇంతో సాయం కూడా చేస్తుంటాడు. 

బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్.. యంగ్ డైరెక్టర్ తో..?

Sampoornesh babu

కోట్లు సంపాదించే హీరోలు చేయలేని పని సంపూర్ణేష్ బాబు చేసి చూపించాడు. ఇక చాలా సాదాసీదాగా ఉండే ఈ హీరో.. గతంలో బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా సందడి చేశాడు. కాని హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేక ఇబ్బందిపడి.. మధ్యలోనే వచ్చేశాడు. నాలుగు గోడల మధ్య ఉండటం తన వల్ల కాదు.. అందరితో కలిసి ఉండాలి అనుకునేవాడినన్నారు సంపూ. 

ఇక తన కామెడీ పెర్ఫామెన్స్ లతో.. సినిమాల స్పూఫ్ లు.. హీరోలను ఇండైరెక్ట్ గా ఇమిటేట్ చేస్తూ.. చేసిన సినిమాలు.. సంపూను బర్తింగ్ స్టార్ ను చేశాయి. అయితే ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు పెద్దగా కనిపించడం లేదు. ఆయన సినిమాలు కూడా వచ్చినట్టు లేదు. దాంతో ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలిపెట్టారని ప్రచారం జరిగింది. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి

Sampoornesh babu

సంపూర్ణేష్ బాబు సినిమాలు  చేయడం లేదు... అటు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. దీంతో సోషలక్ మీడియాతో పాటు.  యూట్యబ్ ఛానల్స్ కొన్ని ఆయన్ను వెతకడం స్టార్ట్ చేశాయి. ఇక సంపూర్ణేష్ బాబు ఇండస్రీని వదిలేయలేదు. ఆయన చివరిసారిగా మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో కనిపించారు. 
 

Sampoornesh Babu

ఈసినిమా తరువాత  ఆయన  మళ్లీ ఎక్కడ  కనిపించడం లేదు. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. సంపూర్ణేష్ బాబు రెండు సినిమాలో నటించాడట. ఈ చిత్రాలు కూడ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక.. తన సొంత ఊరిలో తన వృత్తిని చేసుకుంటున్నాడని తెలుస్తోంది. 
 

Sampoornesh Babu new movie Kobbari Matta

సంపూర్ణేష్ బాబుది సిద్దిపేట. ఆయన స్వర్ణకారుడు. సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి.. ఆతరువాత తన సొంత గ్రామానికి వెళ్ళి.. అక్కడ తన వృత్తి చేసుకుంటుంటుంటారు. చాలా సాదా సీదా జీవితం గడుపుతుంటాడు సంపూ. అందరితో కలిసి మెలిసి ఉంటారు. ఇక ఆయన నెక్ట్స్  సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. 

Latest Videos

click me!