నాగ మణికంఠ సింపతీ గేమ్ ఆడుతున్నాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. మొదటి వారమే ట్రాజిక్ ఫ్యామిలీ స్టోరీ ప్రేక్షకుల ముందు పెట్టాడు. తండ్రి బాల్యంలోనే చనిపోతే, అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. పెంపుడు తండ్రి వలన అవమానాలు, కష్టాలు పడ్డాను. తల్లి దహన సంస్కారాల కోసం అడుక్కున్నాను, అంటూ విషాదగాథ బయటపెట్టాడు.
పల్లవి ప్రశాంత్ వలె నాగ మణికంఠ మొదటి వారం నుండే సింపతీ కార్డు కోసం ట్రై చేస్తున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. ఇక విగ్ తీసేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న నాగ మణికంఠ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. పలువురు సదరు వీడియోను ట్రోల్ చేశారు. ఈ పరిణామాలతో నాగ మణికంఠ మాత్రం ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు.