కోట్లు ఇచ్చినా నాగచైతన్యతో చేయను అన్న స్టార్ హీరో కూతురు... అందుకు సమంతనే కారణమా?

First Published | Mar 19, 2024, 6:59 AM IST

హీరో నాగ చైతన్యతో ఓ స్టార్ కిడ్ ఎప్పటికీ నటించను అని చెప్పేశారట. అందుకు సమంతనే కారణమట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం.. 
 

Akkineni Naga Chaitanya

అక్కినేని హీరో నాగ చైతన్య పరిశ్రమలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏం మాయ చేసావే, 100% లవ్, మనం,  మజిలీ, లవ్ స్టోరీ వంటి హిట్స్ ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చాయి. యూత్ లో నాగ చైతన్యకు మంచి క్రేజ్ ఉంది. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

Akkineni Naga Chaitanya

వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్న నాగ చైతన్య ఆమెతో విడిపోయాడు. 2018లో సమంత-నాగ చైతన్యల వివాహం ఘనంగా జరిగింది. పెళ్ళైన నాలుగేళ్లకు 2021లో విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. 



సమంత, నాగ చైతన్య ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతున్నారు. నాగ చైతన్య తండేల్ టైటిల్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. నాగ చైతన్య జాలరి రోల్ చేయడం విశేషం. 
 


ఇక సమంత కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయలేదు. ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ తో పాటు మోడలింగ్ చేస్తుంది. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వరుణ్ థావన్ హీరోగా నటించాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా త్వరలో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. 
 


ఇదిలా ఉంటే సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్యతో ఓ స్టార్ హీరో కూతురు నటించకూడదని నిర్ణయించుకున్నారట. ఆమె ఎవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. ఒకప్పటి స్టార్ శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి నాగ చైతన్య సినిమాలో వచ్చిన ఆఫర్స్ తిరస్కరించిందట. అందుకు సమంతనే కారణం అట. 

సమంత-వరలక్ష్మి బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఈ క్రమంలో సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్య సినిమాలో కోట్లు ఇచ్చినా నటించేది లేదని ఆమె వెల్లడించారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ విలన్ గా ఫేమస్. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ వ్ వంటి హిట్ చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేసింది... 

Latest Videos

click me!