‘టిల్లు స్క్వేర్’లో బోల్డ్ సీన్లు.. ఏంటని అడిగితే.. ఇంకా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చిన అనుపమా.. షాకింగ్ కామెంట్స్!

Published : Mar 18, 2024, 10:21 PM IST

యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)  బోల్డ్ పెర్ఫామెన్స్ తోనే కాదు.. బోల్డ్ గానూ మాట్లాడుతూ షాకిస్తోంది. ఆమె లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

PREV
16
‘టిల్లు స్క్వేర్’లో బోల్డ్ సీన్లు.. ఏంటని అడిగితే.. ఇంకా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చిన అనుపమా.. షాకింగ్ కామెంట్స్!

మలయాళ బ్యూటీ, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ వరుసగా హిట్లు అందుకుంటూ వస్తోంది. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోనూ సందడి చేస్తోంది. సినిమాల విషయంలో ఇటీవల మరింత జోరు పెంచింది.

26

టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈ ముద్దుగుమ్మ చాలా పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది.  సంప్రదాయంగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మరోవైపు హ్యాట్రిక్ హిట్ ను కూడా అందుకుంది.

36

ఆ తర్వాత హిట్లు లేకపోవడంతో రూటు మార్చుకుంది. బోల్డ్ పెర్ఫామెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. తన కెరీర్ లోనే ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో ఫస్ట్ లిప్ లాక్ పెట్టి షాకిచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్లు కూడా ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉన్నాయి.

46

ఇలా తన పద్ధతి మొత్తం మార్చుకుంటూ వచ్చింది. ఇక ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)తో రోమాన్స్ లో రెచ్చిపోయింది.

56

ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’ నుంచి వచ్చిన ప్రమోషనల్ మోటీరియల్ లో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ పెర్ఫామెన్స్ కు అంతా షాక్ అవుతున్నారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఈరోజు ‘హో మై లిల్లీ’ (Oh my Lilly) అనే సాంగ్ విడుదలైంది.

66

తన బోల్డ్ పెర్ఫామెన్స్ పై స్పందించింది. ’రోజూ అన్నమే తినలేం కదా.. ఓ బిర్యానీ, పుల్వా కావాలి.. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కావాలి... అయితే డైరెక్టర్ నాకు ఇచ్చిన డ్యూటీని పూర్తి చేయడం నా బాధ్యత.. అందుకే అలా చేశాను.’ అంటూ చెప్పుకొచ్చింది. 

click me!

Recommended Stories