డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ పోతినేని ఓ యువ దర్శకుడి చిత్రానికి కమిటైన సంగతి తెలిసిందే. ఆ యువ డైరెక్టర్ ఎవరో కాదు.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన మహేష్ బాబు పి. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఎమోషనల్ అండ్ రొమాంటిక్ చిత్రంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.