నా మొదటి సినిమాకు ఇలాంటి హీరోనా.. ఎన్టీఆర్ ని చూసి రాజమౌళి నిరాశ చెందిన వేళ!

First Published May 20, 2021, 10:22 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వింటే మాస్ ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే. తాతకు దగ్గ మనవడిగా, ఆయన వారసుడిగా టాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. నటనలో , డాన్స్ లలో , వాక్ పటిమలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. పట్టుమని 20ఏళ్ళు నిండకుండానే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఘనచరిత్ర ఎన్టీఆర్ సొంతం. మరి ఇలాంటి గొప్ప నటుడు రాజమౌళికి నచ్చలేదట. స్వయంగా రాజమౌళి తెలియజేసిన ఆ నేపథ్యం వింటే షాక్ కావాల్సిందే. 
 

హీరోగా ఎన్టీఆర్ మొదటి చిత్రం నిన్ను చూడాలని. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 2001లో ఆ సినిమా విడుదలయ్యే నాటికి ఎన్టీఆర్ కి టీనేజ్ కూడా పూర్తి కాలేదు.
undefined
మరో వైపు దర్శకుడు రాజమౌళి తన డెబ్యూ మూవీ కోసం హీరోని వెతికే పనిలో ఉన్నారు. రాజమౌళి ఎవరో సలహా కారణంగా ఎన్టీఆర్ ని హీరోగా ఎంచుకోవాల్సి వచ్చింది. 18ఏళ్ళ ప్రాయంలో నూనూగు మీసాలతో ఉన్న ఎన్టీఆర్ ని చూసిన రాజమౌళి పూర్తిగా నిరాశ చెందారట.
undefined
దర్శకుడు తాను అనుకున్న కథకు హీరో ఇలా ఉండాలని ఊహించుకుంటారు. రాజమౌళి ఊహించుకున్న దానికి ఎన్టీఆర్ సరిపోలలేదట. తక్కువ హైట్ తో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ఆహార్యం రాజమౌళికి అసలు నచ్చలేదట.
undefined
ఎంతో కష్టపడి మొదటి సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం దక్కించుకున్నాను. నా మొదటి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడు ఏంటి అని రాజమౌళి మనసులో బాధపడ్డారట. అయితే తన అభిప్రాయం చాలా తప్పని షూటింగ్ మొదలయ్యాక రాజమౌళికి అర్థం అయినదట.
undefined
ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్ సూపర్ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ కి అది హీరోగా మొదటి హిట్. తనకు మొదటి హిట్ ఇచ్చిన ఎన్టీఆర్ తోనే రాజమౌళి ఆయన రెండో చిత్రం సింహద్రి తెరకెక్కించారు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
undefined
మూడవ చిత్రంగా వీరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం యమదొంగ. యమదొంగ సోషియో ఫాంటసీ సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
undefined
ఆర్ ఆర్ ఆర్ మూవీతో మరోమారు రాజమౌళి-ఎన్టీఆర్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశలో ఉంది.
undefined
ఎన్టీఆర్ ని ఇతను ఎలా హీరో అనుకున్న ఆలోచన నుండి అతనితోనే అత్యధిక చిత్రాలు చేసిన దర్శకుడిగా రాజమౌళి మారారు. రాజమౌళి ఎన్టీఆర్ తో ఆర్ ఆర్ ఆర్ తో కలిపి నాలగవ చిత్రం కావడం విశేషం. మరే ఇతర హీరోతో రాజమౌళి నాలుగు చిత్రాలు చేయలేదు.
undefined
click me!