సొంతూరికి పోయి గొర్రెలు కాసుకుంటున్న జబర్దస్త్ కమెడియన్...  పాపం ఎంత కష్టం వచ్చిపడింది!

First Published May 20, 2021, 9:12 AM IST


జబర్దస్త్ కమెడియన్ గొర్రెలు కాపరిగా మారాడు . తన ఊరిలో ఉపాధి పనులు చేసుకుంటూ కనిపించి షాకిచ్చారు. ఇదంతా కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభావమే అని తెలుస్తుంది.

టీమ్ లతో సంబంధం లేకుండా ప్రతి జబర్దస్త్ టీమ్ లో కనిపిస్తూ ఉంటాడు కమెడియన్ బాబు. ముఖంలో ఎప్పుడూ ఒకే ఎక్స్ ప్రెషన్ కలిగి ఉండడం ఇతని ప్రత్యేకత. ముఖంలో హావభావాలు పలకవని కమెడియన్స్ ఇతనిపై పంచ్ వేస్తూ ఉంటారు.
undefined
ఇప్పటికి వందకు పైగా స్కిట్స్ లో నటించిన బాబు బుల్లితెర ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.  ఓ ప్రత్యేకమైన శైలిని కలిగి తన మార్క్ కామెడీతో చాలా కాలంగా బాబు హాస్యం పంచుతున్నాడు. కాగా సడన్ గా తన ఊరిలో పనులు చేసుకుంటూ కనిపించి బాబు షాక్ ఇచ్చాడు.
undefined
జబర్దస్త్ బాబు తన ఊరిలో మేకలు కాస్తున్న వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దానికి క్యాప్షన్ గా కింగ్ లానే కాదు ఇలా కూడా హ్యాపీగా ఉండవచ్చు... అని తెలిపారు. మనసుకు నచ్చిన పని ఎలాంటిది అయినా ఆస్వాదించవచ్చని బాబు ఫీలింగ్ కాబోలు.
undefined
మరో వీడియోలో బాబు ఉపాధి హామీ పని చేస్తూ కనిపించాడు. దీనిలో భాగంగా పంట కాలువలో మట్టిని  తొలగిస్తూ, గట్లు సరి చేస్తున్నాడు. ఒక్కసారిగా పల్లెటూరి కూలీగా మారిన బాబు నేపథ్యం ఏమిటో పూర్తిగా అర్థం కాలేదు.
undefined
షూటింగ్ కి కొంచెం గ్యాప్ రావడంతో బాబు సొంత ఊరికి వెళ్లి, గతంలో తాను చేసిన పనులు ఎంజాయ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. మరో వైపు లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా షూటింగ్స్ లేక సొంత ఊరికి వెళ్లి పనులు చేసుకుంటున్నాడని కూడా అనిపిస్తుంది.
undefined
ఈ రెండు పరిస్థితులలో నిజం ఏదైనా.. లాక్ డౌన్, వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్స్ జోరు తగ్గిన మాట వాస్తవం. బుల్లితెర షోలు నిరవధికంగా నడుస్తున్నా, సినిమా షూటింగ్స్ కి మాత్రం బ్రేక్ పడింది.
undefined
పరిశ్రమలో గత ఏడాది మాదిరి కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. కొందరు సినీ కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
undefined
click me!