ప్రభాస్ ఇమేజ్ మార్చేసిన ఆ సినిమా రానా చేయాల్సిందా.. ఎందుకు రిజెక్ట్ చేశాడు?

Published : Mar 04, 2024, 12:00 PM IST

ప్రభాస్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిన ఓ చిత్రం రానా చేయాల్సిందట. ఆ కథ మొదట రానా వద్దకు వెళ్లిందట. ఆ సినిమా ఏదో, ఆ కథ ఏంటో చూద్దాం...   

PREV
16
ప్రభాస్ ఇమేజ్ మార్చేసిన ఆ సినిమా రానా చేయాల్సిందా.. ఎందుకు రిజెక్ట్ చేశాడు?
Prabhas

ప్రభాస్ కెరీర్ బిగినింగ్ నుండి మాస్ చిత్రాలు చేశాడు. ఛత్రపతి, యోగి వంటి చిత్రాలు ఆయనకు విపరీతమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. స్టార్ గా ఎదిగేలా చేశాయి. ఇక బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. 
 

26


ప్రభాస్-రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. బాహుబలి 2 అయితే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటికీ అనేక రికార్డులు బాహుబలి 2 సొంతం. బాహుబలి చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. 

36
Darling

అయితే ప్రభాస్ కి లేడీ ఫాలోయింగ్ తెచ్చిన చిత్రం డార్లింగ్. ఈ చిత్రం ముందు వరకు ప్రభాస్ కి పెద్దగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కాదు. డార్లింగ్ మూవీతో ప్రభాస్ అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. అప్పటివరకు మహేష్ బాబు అభిమానులుగా ఉన్న అమ్మాయిలు ప్రభాస్ ఫ్యాన్స్ అయ్యారు. 
 

46


తొలిప్రేమ ఫేమ్ కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్ కి జంటగా కాజల్ నటించింది. లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ జోడించి డార్లింగ్ మూవీ తెరకెక్కించారు. 2010లో విడుదలైన డార్లింగ్ సూపర్ హిట్ అందుకుంది. ప్రభాస్ కెరీర్ కి ప్లస్ అయ్యింది. 
 

56


అయితే ఈ కథ మొదట రానా వద్దకు వెళ్లిందట. దర్శకుడు కరుణాకరన్ రానాతో డార్లింగ్ మూవీ చేయాలి అనుకున్నాడట. కారణం తెలియదు కానీ... డార్లింగ్ స్టోరీని రానా చేయలేదు. కథకు కొన్ని మార్పులు చేసి ప్రభాస్ ని అప్రోచ్ అవ్వగా... ఆయన ఓకే చేశాడట. 


 

66

ఆ విధంగా రానా వద్దనుకున్న కథతో ప్రభాస్ కి హిట్ పడింది. డార్లింగ్ తర్వాత విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు ప్రభాస్ కి విపరీతమైన లేడీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. మరి డార్లింగ్ మూవీని రానా చేస్తే ఎలా ఉండేదో. కాగా బాహుబలి సిరీస్లో ప్రభాస్ కి విలన్ గా రానా నటించిన విషయం తెలిసిందే... 

Read more Photos on
click me!

Recommended Stories